Movies'రాజు వచ్చినాడో' టైటిల్ తో పవన్ త్రివిక్రం..!

‘రాజు వచ్చినాడో’ టైటిల్ తో పవన్ త్రివిక్రం..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో మూవీ సెట్స్ మీద ఉంది. ఈ సినిమా టైటిల్ గా ఇన్నాళ్లు ఏవేవో పేర్లు వినిపించాయి కాని ఫైనల్ గా రాజు వచ్చినాడు అన్న టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ చేశారని ఎక్స్ క్లూజివ్ టాక్. పవన్ కళ్యాణ్ ఇందులో స్టూడెంట్ గా కనిపిస్తుండటం విశేషం.

జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవర్ స్టార్ తో త్రివిక్రం చేస్తున్న మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. కె.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్న మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది.

కాటమరాయుడు అంచనాలను అందుకోలేకపోయింది కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు పవన్ కళ్యాణ్. సినిమా టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్ డే నాడు రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news