Moviesఅప్పట్లో ఆ సినిమా...అనే రేంజ్‌లో హిస్టరీ క్రియేట్ చేశారుగా?

అప్పట్లో ఆ సినిమా…అనే రేంజ్‌లో హిస్టరీ క్రియేట్ చేశారుగా?

తెలుగు ప్రేక్షకులు మారారు. కానీ ఆ విషయం సినిమా ఇండస్ట్రీ జనాలకే పూర్తిగా అర్థం కావడం లేదు.తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో మారారు. వాళ్ళు ఎలాంటి సిినిమాల కోసం ఎదురు చూస్తున్నారు అనే విషయం చెప్పడానికి ఇప్పుడు మన ముందుకు మరో సినిమా వచ్చింది. రావడమంటే వెయ్యికి పైగా థియేటర్స్, న్యూస్ ఛానల్స్, పేపర్స్, వెబ్ మీడియా అనేదానితో సంబంధం లేకుండా కోట్లాది రూపాయలతో ఊదరగొట్టే పబ్లిసిటీ ఐటెం సాంగ్స్, స్టార్ హీరోయిన్ అందాలు లాంటి హంగులతో కాదు…..కేవలం కంటెంట్‌తో….ఓ కొత్త కథతో….కథనంతో. ఆ సినిమానే అప్పట్లో ఒకడుండేవాడు. ఈవెన్ హైదరాబాద్‌లో కూడా కనీస స్థాయి థియేటర్స్ దొరకకపోయినప్పటికీ కలెక్షన్స్‌కి మాత్రం ఢోకా లేకుండా పోయింది. పబ్లిసిటీ కోసం పట్టుమని పది లక్షలు కూడా ఖర్చు పెట్టకపోయినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఎగబడి చూస్తున్నారు. సినిమా గురించి పదిమందికీ చెప్తూ ఫ్రీ పబ్లిసిటీ చేసి పెడ్తున్నారు.

వరుస ఫ్లాప్స్‌తో ఇబ్బంది పడుతున్న నారా రోహిత్, ఎవరో కూడా ఎవరికీ తెలియని శ్రీ విష్ణులు హీరోలుగా వచ్చిన ఈ సినిమా ఇరవై కోట్లు కలెక్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వారంలో థియేటర్స్ సంఖ్య కూడా పెరుగుతుందని తెలుస్తోంది. మొదటి సినిమా అయ్యారేతోనే తానేంటో ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్ సాగర్ కె చంద్ర ఇప్పుడు అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో కంప్లీట్ హిట్ కొట్టాడు. డబ్బులతోపాటు గొప్ప పేరు కూడా తెచ్చుకున్నాడు. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాకు ఓ కొత్త సినిమాను అందించాడు. ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం కూడా గట్టి డిమాండ్ ఉందని తెలుస్తోంది. చందూ మొండేటిలానే సాగర్ కె చంద్ర కూడా ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాడు. అప్పట్లో ఒక సినిమా వచ్చింది…మంచి హిట్‌తో పాటు పేరు కూడా తెచ్చుకుంది అనే రేంజ్ సినిమా తీసిన సాగర్ ముందు ముందు కూడా స్టార్స్ కోసమో, ఇమేజ్ కోసమో కాకుండా కథనే నమ్ముకుని ఇంకా మంచి వెరైటీ అండ్ కొత్త కథలతో మంచి సినిమాలే తీయాలని సినీ విమర్శకులు కూడా ఆశిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news