Newsషాకింగ్ షాకింగ్ :నాగార్జున 'ఓం నమో వెంకటేశాయ' సినిమా కూడా లీకయింది!!

షాకింగ్ షాకింగ్ :నాగార్జున ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమా కూడా లీకయింది!!

దర్సకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్సకత్వంలో అక్కినేని నాగార్జున శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుడిగా నటిస్తున్న ఓం నమో వెంకటేశాయ చిత్రం క్లిప్ లు సైతం లీక్ అయ్యాయన్న షాకింగ్ న్యూస్ తెలియగానే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటికే బాహుబలి రెండవ భాగం యుద్ధ సన్నివేశాలు లీక్ అయ్యి షాక్ కి గురయిన పరిశ్రమ వారం రోజులు గడవక ముందే ఓం నమో వెంకటేశాయ చిత్రం క్లిప్పులు కూడా లీక్ అయ్యాయని తెలిసి మరింత దిగ్బ్రాంతి కి గురయ్యింది.

రాజమౌళి బాహుబలి 2 యుద్ధ సన్నివేశాలు లీక్ చేశారంటూ విజయవాడ పోలీసులు ఆరుగురు విద్యార్థులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వారి వద్ద బాహుబలి క్లిప్పులతో పాటు దర్శకేంద్రుడి ఓం నమో వెంకటేశాయ సినిమా క్లిప్పింగ్‌ లను కూడా గుర్తించారు. అయితే ఇందులో ఆనందించే విషయం ఏమిటంటే ఆ క్లిప్పులు ఇంకా బయటకి రాకపోవడం. ఏది ఏమైనప్పటికిని ఇంటి దొంగలే ఇలా చోరీ చేసి సినిమాలను పైరసీ చేసి చంపేయడం పలువురు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేసారు. అలాగే దోషులను కఠినంగా శిక్షించి ఎన్నో లక్షల కుటుంబాలకు అన్నం పెడుతున్న సినీ పరిశ్రమని బ్రతికించాలని కోరారు. అలాగే ఇటువంటి సంఘటనలు మరలా చోటు చేసుకోకుండా సినీ పెద్దలు కూడా దీనికి ఒక పరిష్కారం కనుక్కొని కఠినంగా అమలు పరచాలని కోరుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news