Newsవిమానాల్లో ఇక సరదా.. సరదా..

విమానాల్లో ఇక సరదా.. సరదా..

మీకు విమాన ప్రయాణం బోర్ కొడుతుందా. ఎంతసేపు ఆ సీట్లో కూర్చొని పుస్తకాలు చదవడం, సినిమాలు చూడ్డం తప్ప ఏం చేయలేకపోతున్నారా. మహా అయితే ఓ కాక్ టైల్ తాగి కునుకు తీయడమేనా. అయితే మీలాంటివాళ్ల కోసం ఓ గుడ్ న్యూస్.

విమాన ప్రయాణంలో చేతిలో మొబైల్ ఉన్నా ఏమీ చెయ్యలేం. అదే మొబైల్ యూజ్ చేసుకునే చాన్స్ ఉంటే.. అది కూడా వైఫై ఉంటే. ఎగిరి గంతేయ్యాలనిపిస్తోంది కదూ.. ఆగండాగండి.. దీనికి కొద్దిగా టైమ్ పట్టుద్ది. ఇప్పటిదాకా విమాన ప్రయాణాల్లో మొబైల్, ఇంటర్నెట్ వాడకానికి పర్మిషన్ లేదు. అయితే విమానాల్లో వైఫై ఇవ్వాలని యోచిస్తోంది కేంద్రం. పదిరోజుల్లో శుభవార్త చెబుతామంటున్నారు పౌర విమానాయన కార్యదర్శి ఆర్ఎన్ చౌబే. ఇది అమల్లోకి వస్తే ప్రయాణీకుల పంట పండినట్టే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news