Gossipsమ‌హేష్‌కు హాండీచ్చిన దిల్ రాజు..!

మ‌హేష్‌కు హాండీచ్చిన దిల్ రాజు..!

ప్రిన్స్ మ‌హేష్‌బాబుతో సినిమా అంటే ఎంత పెద్ద నిర్మాత అయినా ఎగిరి గంతేస్తాడు… కానీ ఇప్పుడు మ‌హేష్‌బాబు సినిమా అంటే కొంద‌రు పెద్ద నిర్మాత‌లు అమ‌డ దూరంగా ప‌డుగెడుతున్నారు. అస‌లు ప్రిన్స్ మ‌హేష్‌బాబు సినిమాకు మార్కెట్‌లో మినిమ‌మ్ గ్యారెంటీ ఉంటుంద‌నే ఒక్ప‌టి మాట‌. కానీ ఇప్పుడు మినిమ‌మ్ గ్యారెంటీ కాదు క‌దా… అస‌లు ఎప్పుడు చేయి కాల్చుకోవాల్సి వ‌స్తుందో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంద‌ని, అందుకే పెద్ద నిర్మాత‌లు మ‌హేష్‌కు దూరంగా జ‌రుగుతున్నార‌ట‌. ఇప్పుడు అదే కోవ‌లోకి దిల్ రాజు. పీవీపీ లు ఉన్నారు…

ఇప్పుడు దిల్ రాజు, పీవీపీ లు మ‌హేష్ బాబుకు దూరంగా జ‌రుగడం టాలీవుడ్‌లో హాట్ టాపీక్‌గా మారింది. ఇది గాసిప్పా… లేక నిజ‌మేనా అనేది తేలాల్సి ఉంది. అయితే కొంద‌రు టాలీవుడ్ విశ్లేష‌కుల అభిప్రాయం ప్ర‌కారం ఇది నిజ‌మే అనే టాక్ వినిపిస్తుంది. దిల్ రాజు, పివీపీలు మ‌హేష్ బాబుతో మ‌హార్షి సినిమా కు పెట్టుబ‌డులు పెట్టి చేతులు కాల్చుకున్న త‌రువాత వారి ఆలోచ‌న‌లో మార్పు వ‌చ్చింద‌ట‌. అందుకే మ‌హేష్‌బాబుకు ఎంత దూరం ఉంటే అంత మంచిది అనే భావన‌తో దిల్ రాజు, పీవీపీ ఉన్న‌ట్లు టాక్‌.

ఇక పోతే మ‌హేష్‌బాబు ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓసినిమా ఉంటుంద‌ట‌. ఈ సినిమాను నిర్మించేందుకు దిల్ రాజు, పీవీపీ స‌సేమిరా అంటున్నార‌ట‌.. కాకుంటే మ‌హేష్‌బాబుతో గొడ‌వ‌కు దిగ‌కుండా రెమ్యూన‌రేష‌న్ పంప‌కంలో ముందుగానే నిర్మాత‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌నే కండిష‌న్ పెట్టాడ‌ట దిల్ రాజు. మ‌హేష్‌బాబు నాన్ థ్రియోటిక‌ల్ రైట్ తీసుకుంటుండ‌గా, ద‌ర్శ‌కుడికి రెమ్యూన‌రేష‌న్ ముందుగానే ఫిక్స్ చేస్తారు. అలాగే పెట్టుబ‌డి పెట్టి త‌రువాత లాభాలు వ‌చ్చినా, న‌ష్టాలు భ‌రించే నిర్మాత భ‌విష్య‌త్ ఇబ్బందులో ప‌డుతున్న ద‌రిమిలా ముందుగానే నిర్మాత‌కు ఇంత అని ఫిక్స్ చేయాల‌ని కండిష‌న్ పెట్టాడ‌ట‌. ఇది ఎలా సాధ్య‌మ‌ని మ‌హేష్‌బాబు అంటున్నాడ‌ట‌. అందుకే మ‌రో సినిమాకు మ‌హేష్‌తో చేయ‌డం కుద‌ర‌ద‌ని స‌న్నిహితుల దిల్ రాజు అన్న‌ట్లు వినికిడి. సో ప్రిన్స్‌తో దిల్ రాజు, పీవీపీ దూరం జ‌రిగిన‌ట్లే లెక్క‌. ఇప్పుడు ప్రిన్స్‌తో డివివి దాన‌య్య కాని లేక ఆసియ‌న్ అనిల్ కాని సినిమా చేసే అవ‌కాశం ఉంద‌ని టాక్‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news