Newsయంగ్ టైగర్ అరవింద సమేత టైటిల్ రిలీజ్ జూన్ 1 న..!

యంగ్ టైగర్ అరవింద సమేత టైటిల్ రిలీజ్ జూన్ 1 న..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో రాబోతున్న సినిమా అరవింద సమేత. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమా మీద అంచనాలను పెంచేసిన ఈ సినిమా టైటిల్ పోస్టర్స్ తో ట్విట్టర్ ట్రెండింగ్ లో టాప్ లో నిలిచిందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా కేవలం తెలుగులోనే కాదు మలయాళంలో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నరట దర్శక నిర్మాతలు.

జనతా గ్యారేజ్ సినిమాతో మలయాళంలో కూడా ఎన్.టి.ఆర్ కు మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే ఈ అరవింద సమేత సినిమాను అక్కడ డైరెక్ట్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా మలయాళ టైటిల్ ను జూన్ 1 న ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. మలయాళంలో కూడా ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ భారీగా ఉన్నారని తెలుస్తుంది.

వారి కోసం ఓ క్రేజీ టైటిల్ ఈ సినిమాకు పెట్టనున్నారట. ఎన్.టి.ఆర్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ ఇయర్ దసరా బరిలో ఉంచేలా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news