Moviesప్రభాస్ ఒక పెద్ద ఫూల్ : బాహుబలి తమిళ ఆడియో ఫంక్షన్...

ప్రభాస్ ఒక పెద్ద ఫూల్ : బాహుబలి తమిళ ఆడియో ఫంక్షన్ లో రాజమౌళి ఘాటైన వ్యాఖ్యలు

బాహుబలి రెండవ భాగం విడుదల దగ్గరవుతున్నా కొద్దీ బాహుబలి టీం ప్రమోషన్ల కార్యక్రమాల్లో తలమునకలైంది. నిన్న చెన్నై లో తమిళ ఆడియో ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. తమిళ హీరోలు ధనుష్ మరియు విక్రమ్ ప్రభు (పిజ్జా హీరో) లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ధనుష్ చేతుల మీదుగా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ ప్రభాస్ ఒక పెద్ద ఫూల్ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. తన జీవితంలోని 4 సంవత్సరాల విలువైన జీవితాన్ని ఒక సినిమాపై ఎంతో అంకిత భావంతో పనిచేసిన ఒక హీరో పేరు చెప్పండి. అందుకే ప్రభాస్ నాకు చాలా ఆప్త మిత్రుడుగా కూడా మారాడు అంటూ ఎంతో భావోద్వేగంతో ప్రసంగించారు. అయితే రాజమౌళి మాట్లాడుతున్నంత సేపు ప్రభాస్ సిగ్గుపడుతూ చేతులు జోడిస్తూ రాజమౌళి కి నమష్కారం పెట్టడం పలువురిని ఆకర్షించింది, ప్రభాస్ కూడా తన ప్రసంగంలో రాజమౌళి బాహుబలి కోసం 4 సంవత్సరాలు కాదు 7 సంవత్సరాలైనా వేచివుండేవాడినని చెప్పటం కొసమెరుపు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news