Newsస్పైడర్ సంచలనాలు మొదలైనట్టే.. తమిళంలో ఏ తెలుగు హీరో పొందని క్రేజ్..!

స్పైడర్ సంచలనాలు మొదలైనట్టే.. తమిళంలో ఏ తెలుగు హీరో పొందని క్రేజ్..!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ స్టామినా గురించి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సత్తాని తమిళ మార్కెట్ పై కూడా చూపించేందుకే మురుగదాస్ స్పైడర్ మూవీతో వస్తున్నాడు మహేష్. తమిళంలో స్టార్ డైరక్టర్ అయిన మురుగదాస్ మహేష్ తో తెలుగు తమిళ భాషల్లో స్పైడర్ తెరకెక్కించాడు. తెలుగులో ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ భారీ రేంజ్ లో చేస్తుండగా ఇప్పుడు తమిళంలో కూడా ఈ సినిమా రికార్డ్ రేటుకి అమ్ముడయ్యిందని తెలుస్తుంది.

ప్రముఖ్య తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మహేష్ స్పైడర్ సినిమాను హయ్యెస్ట్ బడ్జెట్ తో 23 కోట్లకు కొనేసిందట. మహేష్ తెలుగు టాప్ హీరో అయితే ఇప్పటిదాకా తమిళంలో డైరెక్ట్ ఫైట్ కు దిగింది లేదు. తెలుగులో తమిళ హీరో హవా ఎన్నాళ్ల నుండో కొనసాగుతున్నా తమిళంలో మన వాళ్లు మాత్రం నామ మాత్రంగానే ఉన్నారు.

అందుకే మహేష్ తన స్పైడర్ తో ఆ లెక్క మార్చేశాడు. కోలీవుడ్ లో స్పైడర్ ఆ రేంజ్ అమ్ముడవడానికి మురుగదాస్ కూడా ఓ కారణం అయినా మహేష్ స్టామినా తెలియచేసేలా ఈ సినిమా అన్నేసి కోట్లతో కొనడం అంటే కచ్చితంగా ఏ తెలుగు హీరో పొందని అరుదైన రికార్డ్ అని చెప్పొచ్చు. అయితే బాహుబలి అంతకుమించి తమిళంలో కొనుగోలు చేసినా రాజమౌళి బ్రాండ్ తో ఆ సినిమా బిజినెస్ జరిగింది. మరి టాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా భారీ రేంజ్ లో బిజినెస్ చేస్తున్న స్పైడర్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news