Moviesమహానటి అంచనాలను అందుకుంటుందా..!

మహానటి అంచనాలను అందుకుంటుందా..!

మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న సినిమా మహానటి. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా స్వప్న సినిమాస్ బ్యానర్లో స్వప్న దత్ నిర్మిస్తున్నారు. రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా భారీతనంతో వస్తుంది. సావిత్రి బయోపిక్ గా ముందునుండి అంచనాలను ఏర్పరచుకున్న ఈ సినిమా కమర్షియల్ గా ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుంది అన్నది డిస్కషన్స్ చేస్తున్నారు.

సినిమా క్లాసిక్ గా మిగలొచ్చు కాని సావిత్రిని ఇష్టపడే వారు ఎంతమంది ఈ సినిమాలకు కదిలివెళ్తారు అని మాట్లాడుతున్నారు. కీర్తి సురేష్ లీడ్ రోల్ కాబట్టి ఆమె అభినయం సావిత్రిని ఎలా పోలి ఉంటుందో అన్న ఎక్సయిటింగ్ తో కొందరు సినిమా చూసే అవకాశం ఉంది. భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమా ఏమేరకు కమర్షియల్ హిట్ అవుతుందా అని అంటున్నారు.

ఓ పక్క భారీ సినిమాలు సత్తా చాటుతుండగా మహానటి మనసులను కదిలిస్తుందా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఒక సినిమా అనుభవం ఉన్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఆ మహానటి జీవిత గాథను ఎలా తెరరూపం దాల్చాడో చూడాలని మహానటి ఫ్యాన్స్ మాత్రం ఆత్రుతతో ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news