దబాంగ్ 3 ట్రైలర్ టాక్.. ఈగ విలన్‌కు చుక్కలు చూపిన సల్లూ భాయ్!

Salman Khan Dabangg 3 Trailer Released

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ దబాంగ్ 3 చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా కోసం సల్లూ భాయ్ ఫ్యాన్స్ ఎంతకాలంగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి దబాంగ్ సిరీస్‌ను కొనసాగించేందుకు సల్మాన్ రెడీ అయ్యాడు. కాగా తాజాగా కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

ఈ ట్రైలర్ ఆధ్యాంతం యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎలాంటి కొదువ లేకుండా దర్శకుడు ప్రభుదేవా జాగ్రత్త పడ్డాడు. సల్మాన్‌ను దబాంగ్ 1 మరియు దబాంగ్ 2 లాగానే ఇందులోనూ చాలా పవర్‌ఫుల్‌గా చూపించారు. పోలీస్ ఆఫీసర్‌గా తన స్టంట్స్‌ను చేస్తూనే అదిరిపోయే కామెడీ టైమింగ్‌తో సల్మాన్ అదరగొట్టాడు. ఇక హీరోయిన్‌గా సోనాక్షి సిన్హాతో పాటు కొత్త హీరోయిన్ సయీ మంజ్రేకర్‌తో సల్మాన్ రొమాన్స్ ఇరగదీశాడు. ఇంకో అసలైన ట్విస్ట్ ఏమిటంటే.. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఆయన కూడా అదిరిపోయే రేంజ్‌లో యాక్షన్‌తో ప్రేక్షకులను అదరగొట్టాడు.

ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే సల్మాన్ ఖాన్ మరోసారి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది. ప్రభుదేవా డైరెక్ట్ చేసిన ఈ సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Leave a comment