మల్టీ స్టారర్ పై కొత్త ట్విస్ట్…! చెర్రీ,తారక్ కి ఆ ముద్దుగుమ్మే కావాలంట

cherri and ntr multi star

దర్శక బాహుబలి జక్కన్న తీయబోయే మల్టీస్టార్ సినిమా మీద ఫ్యాన్స్ భారీగానే ఆశలు పెట్టుకున్నారు. తారక్ – చెర్రీ లు ఈ సినిమాలో నటిస్తుండడం ఓ కొత్త ట్రెండ్ సృష్టిస్తుందని తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ పెద్దలు చెప్తున్నారు. ఇక ఇరువురి అభిమానుల గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఫిలిం ఇండ్రస్ట్రీ ని ఏలుతున్న నందమూరి, మెగా ఫ్యామిలీ హీరో లు ఈ సినిమాల్లో నటిస్తుండడంతో అందరిలోనూ ఒకటే ఉత్కంట రేగుతోంది. ఈ సినిమా ప్రారంభం అవుతుంది అన్నప్పటి నుంచి దీనిమీద ఎదో ఒక వార్త నిత్యం హల్ చల్ చేస్తూనే ఉంటున్నాయి.

ఈ ముల్టీస్టార్ సినిమాలో ఈ యంగ్ హీరోల పక్కన నటించబోయే భామలు ఎవరా అని సందేహం అందరిలోనో ఉండగానే జక్కన్న మరో బాంబు పేల్చాడు. ఈ ఇద్దరికీ ఒక్కరే హీరోయిన్ అని సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే వరస అవకాశాలు దక్కించుకుంటున్న ఓ కథానాయిక పేరు బయటకు వచ్చింది. ఆమె మరెవరో కాదు అను ఇమ్మాన్యుయేల్‌.

వరుస పెట్టి ఆఫర్స్ వస్తుండడంతో అను తెలుగులో చాలా బిజీ అయిపొయింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో వస్తున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో పవన్‌కి జోడీగా నటిస్తోంది. అలాగే .. అల్లు అర్జున్‌కి జోడీగా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, నాగచైతన్యకు జోడీగా ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రాల షూటింగులోనూ బిజీగా ఉంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్‌కి జోడీగానూ నటించబోతోందని తెలిసింది. ఇప్పుడు రాజమౌళి చిత్రంలో చరణ్‌కి, తారక్‌కి జోడీగా అను నటిస్తున్నట్లు టాలీవుడ్ సమాచారం. అయితే హీరోయిన్ గా అను ఒక్కరే ఎంపిక చేసారు. అయితే ఈ సినిమాలో రెండో హీరోయిన్ ఉంటుందా అనే విష్యం మాత్రం ఎక్కడా లీక్ చెయ్యడం లేదు. ఈ సినిమా యూనిట్ చెప్తున్నదాని ప్రకారం అను ఒక్కతే హీరోయిన్ అని తెలుస్తోంది.

Leave a comment