Moviesవిజయ్ దేవరకొండ "ఫ్యామిలీ స్టార్" ఫ్లాప్..పండగ చేసుకుంటున్న ఆ ఇద్దరు తెలుగు...

విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ఫ్లాప్..పండగ చేసుకుంటున్న ఆ ఇద్దరు తెలుగు స్టార్స్..!?

ఎస్ .. ఈ న్యూస్ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో బాగా బాగా వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్లాప్ అయినందుకు టాలీవుడ్ లో ఉండే ఇద్దరు స్టార్ సెలబ్రిటీస్ పండగ చేసుకుంటున్నారా ..? అంటే ఎస్అన్న సమాధానమే వినిపిస్తుంది. రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్ . పరశురాం పేట్ల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేశారు .

సీన్ కట్ చేస్తే థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా నెగిటివ్ టాక్ క్రియేట్ చేసుకుంది. సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ కంటెంట్ లేకపోవడం అర్జున్ రెడ్డి లాంటి సినిమా చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫ్యామిలీ స్టార్ సినిమాను యాక్సెప్ట్ చేయలేకపోవడం ఇందుకు ప్రధాన కారణం . అయితే ఈ సినిమా ఫ్లాప్ అవడం ఇద్దరు స్టార్స్ కు హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది అన్న వార్త బాగా వైరల్ గా మారింది .

ఆ ఇద్దరు మరెవరో కాదు. నాగచైతన్య – స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ . నిజానికి గీతాగోవిందం సినిమా తర్వాత పరశురాంపేట్ల డైరెక్షన్ లో గీత బ్యానర్స్ లోనే అల్లు అరవింద్ నిర్మాణంలో నాగచైతన్య హీరోగా ఒక మూవీ చేయాల్సి ఉంది . అంతా ఫిక్స్ అయ్యాక పరశురాంపేట్ల దిల్ రాజుకు ఈ కథను వివరించి అటువైపుగా షిఫ్ట్ అయ్యాడు అంటూ ప్రచారం జరిగింది .

ఒకానొక ఈవెంట్లో అల్లు అరవింద్ సైతం గరం గరంగా పరోక్షకంగా పరశురాంపేట్ల.. పై మండిపడ్డారు . అయితే ఇప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అవడంతో అల్లు అరవింద్ – నాగచైతన్య ఫుల్ ఖుషి అవుతున్నారట . తనను కాదని వేరే హీరోతో తీసిన సినిమా ఫ్లాప్ అవడంతో నాగచైతన్య తనను అవమానించి వేరే ప్రొడ్యూసర్ తో సినిమాకు కమిట్ అయినందుకు అల్లు అరవింద్ ఇద్దరూ కూడా పండగ చేసుకుంటున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news