Movies"ఫ్యామిలీ స్టార్" ఫస్ట్ డే కలెక్షన్స్: విజయ్ దేవరకొండ కెరియర్ లోనే...

“ఫ్యామిలీ స్టార్” ఫస్ట్ డే కలెక్షన్స్: విజయ్ దేవరకొండ కెరియర్ లోనే పరమ చెత్త రికార్డ్.. రౌడీ గాడి పరువు మొత్తం పోయింది పో..!

విజయ్ దేవరకొండ హీరోగా ..మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన తాజా సినిమా ఫ్యామిలీ స్టార్ . ఏప్రిల్ 5వ తేదీ శుక్రవారం గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ క్రియేట్ చేసుకుంది . విజయ్ దేవరకొండ రేంజ్ కి తగిన సినిమా కాదు ఈ మూవీ అంటూ పలువురు ప్రచారం చేస్తున్నారు. సినిమా మొత్తం ఫ్యామిలీ ఓరియంటెడ్ కాన్సెప్ట్ అవ్వడం గతంలో విజయ్ దేవరకొండ సినిమాలు మొత్తం చాలా మాస్ రొమాంటిక్ యాంగిల్స్ లో ఉండడం అభిమానులకు ఈ సినిమా పెద్దగా బుర్రకి ఎక్కలేక పోయింది .

గీతాగోవిందం లాంటి సినిమా తర్వాత పరశురాం విజయ్ దేవరకొండ కాంబో అనగానే ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారు . రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కూడా అలాగే ఉండింది . కానీ సినిమా రిలీజ్ అయ్యాక పరిస్థితి తారుమారు అయిపోయింది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ తాజాగా బయటపడ్డాయి . ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు ఇండియా వైట్ గా 5.75 కోట్లు వసూలు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి .

విజయ్ దేవరకొండ రేంజ్కి ఆయన మార్కెట్ కి ఇది చాలా చాలా తక్కువ. తొలి రోజు థియేటర్ ఆక్యూ పెన్సీ కేవలం 38.45% మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. నిజంగా ఇది విజయ్ దేవరకొండ కెరియర్ లోనే డిజాస్టర్ కలెక్షన్స్ అని చెప్పాలి. ఒకపక్క దిల్ రాజు డైరెక్టర్ పరశురాంపెట్ల మాత్రం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అని ..ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది అని కొందరు రివ్యూవర్స్ కావాలని తక్కువ రేటింగ్స్ ఇస్తున్నారు అని మండిపడుతున్నారు . అయితే ఫ్యాన్స్ నుంచి కూడా ఈ సినిమా నెగిటివ్ కామెంట్స్ అందుకోవడం గమనార్హం. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఫ్యామిలీ స్టార్ సినిమా ఎంతవరకు నెట్టుకొస్తుందో విజయ్ పరువు ని ఏ మాత్రం నిలబెడుతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news