Moviesఓ మై గాడ్ : తారక్ కమిట్ అయిన ఆ క్రేజీ...

ఓ మై గాడ్ : తారక్ కమిట్ అయిన ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందా ..? సోషల్ మీడియాని షేక్ చేస్తున్న న్యూస్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో తెగ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిపోతుంది . జూనియర్ ఎన్టీఆర్ ఆ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పకున్నాడా..? అంటే కొందరు ఎస్ అని మరికొందరు లేదు అది రూమర్ అని ఆన్సర్ ఇస్తున్నారు . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు.

మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ 31 సినిమా సెట్స్ పైకి వెళ్ళాలి. ఈలోపే బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 ను సెట్స్ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు తారక్.

అయితే ఇదే క్రమంలో ప్రశాంత్ నీల్ సైతం సలార్ 2 ను సెట్స్ పై తీసుకురావడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అయితే దేవర రెండు పార్ట్లుగా తెరకెక్కబోతుంది . దేవర రెండు భాగాలు కంప్లీట్ అయిన తర్వాతే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా సెట్స్ పైకి రాబోతుందట. అందుకే ఈలోపు ఆ సినిమాకి సంబంధించిన రెమ్యూనరేషన్ అడ్వాన్స్ డబ్బులు తన దగ్గర ఉండడం సేఫ్ కాదు అని భావించిన ఎన్టీఆర్ ఆ డబ్బులను తిరిగి ఇచ్చేశారట . దీంతో కొంతమంది సినిమా క్యాన్సిల్ అయిందని అందుకే తారక్ డబ్బులు ఇచ్చేసారని ప్రచారం జరుగుతుంది. కానీ సినిమా క్యాన్సిల్ అవ్వలేదు అని జస్ట్ పోస్ట్ పోన్ అయ్యింది అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news