Moviesఅభిమానులకు పిచ్చెక్కించే సర్ప్రైజ్ ..కల్కి సినిమాలో రెబల్ ఫ్యాన్స్ మోస్ట్ ఫేవరెట్...

అభిమానులకు పిచ్చెక్కించే సర్ప్రైజ్ ..కల్కి సినిమాలో రెబల్ ఫ్యాన్స్ మోస్ట్ ఫేవరెట్ హీరోయిన్..!

ఇది నిజంగా రెబెల్ అభిమానులకు పిచ్చెక్కించిపోయే గుడ్ న్యూస్ అనే చెప్పాలి . సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో ..పాన్ ఇండియా హీరో ప్రభాస్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఆయన పేరు చెప్తే అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఓ రేంజ్ లో ఊగిపోతూ ఉంటారు. అలాంటి క్రేజీ నాటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్ నటించిన తాజా మూవీ కల్కి .

ఈ సినిమా మే 30వ తేదీ రిలీజ్ కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అయితే ఈ సినిమాలో అభిమానుల కోసం బిగ్ సర్ప్రైజ్ ను ప్లాన్ చేశాడట డైరెక్టర్ నాగ్ అశ్వీన్. ఈ సినిమాల్లో కోట్లాదిమంది రెబెల్ స్టార్ ఫ్యాన్స్ ఫేవరెట్ హీరోయిన్ అనుష్కను కొన్ని క్లిప్స్ లో చూపించబోతున్నారట . గతంలో ప్రభాస్ – అనుష్క కాంబోలో తెరకెక్కిన కొన్ని సినిమాల్లోని ఫన్నీ సీన్స్ ను ఈ సినిమాలో కామెడీ పండించడానికి వాడుకున్నాడట . ఈ న్యూస్ ఆలస్యంగా బయటికి వచ్చింది . దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ ని తెగ ట్రెండ్ చేస్తున్నారు.

అంతేకాదు వీళ్ళిద్దరి కాంబో మళ్లీ సెట్ అవ్వాలి అంటూ ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు . బాహుబలి తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కనిపించిన మూమెంట్స్ లేవు. అలాంటి ఓరేర్ మూమెంట్ కనిపిస్తే కచ్చితంగా ఫాన్స్ ఎంజాయ్ చేస్తారు. తద్వారా సినిమాకి మంచి పబ్లిసిటీ పాపులారిటీ కూడా వచ్చేస్తుంది అంటూ రెబెల్ ఫాన్స్ మాట్లాడుకుంటున్నారు . చూద్దాం మరి నాగ్ అశ్వీన్ ఐడియా ఎంతవరకు సినిమాకి సక్సెస్ ఇస్తుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news