Moviesదేవరలో ఎన్టీఆర్ అలా కనిపించబోతున్నాడా..? నా సామిరంగా సింహాద్రి కి మించిన...

దేవరలో ఎన్టీఆర్ అలా కనిపించబోతున్నాడా..? నా సామిరంగా సింహాద్రి కి మించిన హిట్ పక్కా.. ఇక ఎవడ్రా ఆపేది..!

ప్రజెంట్ నందమూరి అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు ఎలాంటి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఈ సినిమా కోసం కోట్లాదిమంది జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .

ఈ సినిమాకి సంబంధించిన ఒక్క అప్డేట్ రిలీజ్ అయినా సరే సోషల్ మీడియాని షేక్ చేసే రేంజ్ లో జనాలు నందమూరి అభిమానులు ఆ వార్తను ట్రెండ్ చేస్తూ ఉంటారు . రీసెంట్గా దేవర సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . దేవర సినిమాలో ఎన్టీఆర్ చాలా వైలెంట్ గా కనిపించబోతున్నారట. ఎలా అంటే ఆది – సింహాద్రి టైం లోని కోపాన్ని మళ్ళీతెరపై చూపించడానికి సిద్ధపడ్డారట .

సింహాద్రిలో నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి అనే సాంగ్లో లుంగీ కట్టుకొని విజృంభించేశాడు ఎన్టీఆర్. ఆ తర్వాత ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్టీఆర్ చేయనే చేయలేదు. చాలాకాలం తర్వాత మళ్లీ అలాంటి క్యారెక్టర్ ని తెరపై పది నిమిషాలు చూపించడానికి సిద్ధపడ్డాడు ఎన్టీఆర్ . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది . చాలా కాలం తర్వాత మళ్లీ సింహాద్రి లుక్స్ లో మనం చూడబోతున్నాం అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుంది . అంతేకాదు ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది. ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ 100కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నాడు అన్న ప్రచారం కూడా జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news