Moviesవిజయ్ దేవరకొండ "ఫ్యామిలీ స్టార్" టీజర్ లో ఈ తప్పు గమనించారా.....

విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” టీజర్ లో ఈ తప్పు గమనించారా.. ఫ్యాన్స్ హర్ట్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. తాజాగా నటిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుంది . దిల్ రాజు ఈ సినిమాను చాలా ఇష్టంగా నిర్మిస్తున్నాడు .

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన లుక్స్ అన్నీ కూడా అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. కాగా రీసెంట్గా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ సినిమాకే హైలెట్గా నిలిచింది . పెళ్లిచూపులు సినిమాలో ఎంత క్లాస్ గా కనిపించాడో .. అర్జున్ రెడ్డి సినిమాలో ఎంత వైలెంట్ గా కనిపించాడో .. అందుకు పూర్తి డిఫరెంట్ షేడ్స్ పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు .

టోటల్గా ఫ్యామిలీ మెన్ గా విజయ్ దేవరకొండ మనకి ఈ పిక్చర్ లో కనిపించబోతున్నాడు అని చిన్న టీజర్ తో అర్థమయిపోతుంది . అయితే రిలీజ్ చేసిన టీజర్ బాగానే ఉన్నప్పటికీ ఎక్కడ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో అరిచే సీన్స్ మాత్రం లేదు . విజయ్ దేవరకొండ అనగానే అందరికీ గుర్తొచ్చేది హగ్గులు .. లిప్ లాక్లే .. మరి ఈ సినిమాలో ఒక్కటి కూడా అలాంటి రొమాంటిక్ సీన్ లేకుండా టీజర్ రిలీజ్ చేయడం ఫ్యాన్స్ కి హర్టింగా అనిపిస్తుంది . ప్రెసెంట్ విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news