Moviesహవ్వ..ఛీ ఛీ ..స్టేజీ పైనే ముద్దులతో రెచ్చిపోయిన స్టార్ కపుల్స్.. సుమ...

హవ్వ..ఛీ ఛీ ..స్టేజీ పైనే ముద్దులతో రెచ్చిపోయిన స్టార్ కపుల్స్.. సుమ షాకింగ్ రియాక్షన్ వైరల్(వీడియో)..!!

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ఎలాంటి షోస్ టెలికాస్ట్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. వెండితెరపైనే బీప్ సౌంద్స్.. కళ్ళు మూసుకునే సీన్స్ అంటే బుల్లితెరపై అంతకుమించిన రేంజ్ లో ఉంటున్నాయి. మరి ముఖ్యంగా కొన్ని షో లు టిఆర్పి కోసం ఎంతకైనా దిగజారిపోతున్నాయి . నిన్న మొన్నటి వరకు చాలా చక్కగా అనిపించిన సుమ అడ్డ షో కూడా ఇప్పుడు అందుకు విభిన్నంగా చేస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సుమ కనకాల ..

సుమ అడ్డ షోని హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే . వాలెంటైన్స్ డే సందర్భంగా ఈసారి ఈ షోకి ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే సరదా సరదా రొమాంటిక్ టాస్క్ లను పెట్టారు . దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది . బుల్లితెరపై టీవీ సీరియల్స్ లో రాణిస్తున్న రియల్ లైఫ్ కపుల్స్ విష్ణుప్రియ – సిద్దు- మృదుల- కృష్ణ చైతన్య -మోహిత్ ధరణి- ప్రియా పాల్గొన్నారు . బుల్లితెరపై ఈ జంటలు రెచ్చిపోయారు.

డైరెక్ట్ గా లిప్ కిస్ పెట్టుకుంటున్న ఫొటోస్ కూడా రిలీజ్ అయ్యాయి. వాళ్లు టాస్క్ ఆడుతున్నప్పుడు సుమ ఇచ్చిన రియాక్షన్ వైరల్ గా మారింది . వెంటనే విష్ణు ప్రియ సుమకు కౌంటర్ వేసింది . “మీరు మీ పిల్లలను కూడా ఇలా చేయడం చూసేసారుగా .. ఇక మీకు ఇది ఒక లెక్క నా..? అంటూ కౌంటర్ ఇచ్చింది”. బబుల్గం సినిమాలో రోషన్ కనకాల ఘాటు లిప్ లాక్ లతో రెచ్చిపోయిన విషయం అందరికీ తెలిసిందే . అలా సుమ పరువు స్టేజిపై తీసేసింది విష్ణు ప్రియ. ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 10న టెలికాస్ట్ కానుంది . జస్ట్ ప్రోమోతోనే సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఈ సుమ అడ్డ షో ఫుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే ఇంకా ఎంత రచ్చ చేస్తుందో అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news