Moviesఅఫిషియల్: అందరి ఊహలను తలకిందులు చేసిన వశిష్ట.. చిరంజీవి విశ్వంభరలో అన్...

అఫిషియల్: అందరి ఊహలను తలకిందులు చేసిన వశిష్ట.. చిరంజీవి విశ్వంభరలో అన్ ఎక్స్పెక్టెడ్ హీరోయిన్..!

ఇన్నాళ్లు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్ ఎవరా..? ఎవరా ..? అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి . చాలామంది మెగా ఫాన్స్ ఈ సినిమాలో హీరోయిన్గా అనుష్క శెట్టి అయితేనే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేశారు . మరి కొందరు మృణాల్ ఠాకూర్ అని..మరికొందరు సాయి పల్లవి అని మరికొందరు నయనతార అంటూ రకరకాల ఒపీనియన్ వ్యక్తం చేశారు.

ఫైనల్లీ వాళ్ళ అందరి ఊహలను తలకిందులు చేస్తూ విశ్వంభర సినిమాలో అన్ఎక్స్పెక్టెడ్ బ్యూటీ ని చూస్ చేసుకున్నాడు వశిష్ట. బింబిసార లాంటి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వశిష్ట మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న మూవీ విశ్వంభర. ఈ సినిమా ప్రజెంట్ సెట్స్ పై ఉంది . ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించేసింది చిత్ర బృందం. రీసెంట్గా విశ్వంభర కోసం మెగాస్టార్ చిరంజీవి ఏ స్థాయిలో కష్టపడ్డాడో జిమ్ వీడియో కూడా వైరల్ అయింది .

ఈ సెట్స్ లో పాల్గొన్న చిరంజీవి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది అఫీషియల్ గా ప్రకటించేశారు . ఈ సినిమాలో చెన్నై బ్యూటీ త్రిష నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రీసెంట్గా ఈ సెట్స్ లో పాల్గొన్న త్రిష కు సంబంధించిన ఫొటోస్ రివిల్ చేశారు . సెట్స్ లో త్రిష చిరంజీవి సరదాగా మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది . దాదాపు 18 ఏళ్ల క్రితం వీళ్లిద్దరూ స్టాలిన్ సినిమాలో కలిసిన నటించారు .. మళ్లీ ఇన్నాళ్లకు ఈ జోడి జతకడుతూ ఉండడంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news