Moviesరాజమౌళి - నాగార్జున కాంబోలో కమిట్ అయి క్యాన్సిల్ అయిన సినిమా...

రాజమౌళి – నాగార్జున కాంబోలో కమిట్ అయి క్యాన్సిల్ అయిన సినిమా ఏంటో తెలుసా..? మంచి ఛాన్స్ మిస్ అయిపోయిందే..!

సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు . అంతేకాదు ప్రెసెంట్ రాజమౌళి – మహేష్ బాబు తో ఒక సినిమాను తెరకెక్కించడానికి సిద్ధపడుతున్నాడు . అంతకుముందు రాంచరణ్ – ఎన్టీఆర్ లను పెట్టి ఆర్ఆర్ఆర్ అంటూ సెన్సేషనల్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి పేరు మరింత స్థాయిలో మారుమ్రోగిపోయింది .

కాగా రీసెంట్గా రాజమౌళికి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. గతంలో నాగార్జునతో ఒక సినిమాను తెరకెక్కించాలనుకున్నాడట రాజమౌళి. కానీ కొన్ని కారణాల చేత ఆ సినిమా మరో హీరో చేతిలోకి వెళ్ళిపోయింది . ఆ సినిమా మరేదో కాదు ..”మర్యాద రామన్న”. ఈ సినిమాలో సునీల్ హీరోగా నటించాడు. సలోని హీరోయిన్గా నటించింది. ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంది.

ఈ సినిమాలో మొదటగా హీరోగా రాజమౌళి.. నాగార్జునను అనుకున్నారట . కానీ కొన్ని కారణాల చేత నాగార్జున ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత సునీల్ ఖాతాలోకి ఈ సినిమా వచ్చి చేరింది. అలా నాగార్జున – రాజమౌళి కాంబోలో ఓ సినిమా మిస్సైంది. ఒక్కవేళ్ల ఈ సినిమా చేసుంటే నాగార్జున కెరీర్ మరింత స్ధాయిలో దూసుకుపోయుండేది..ఏం చేద్దాం టైం బ్యాడ్..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news