Movies"ఎక్కడికి వెళ్ళినా.. వదిన వదిన అనే పిలుస్తున్నారు".. మెగా ఫ్యాన్స్ పిలుపు...

“ఎక్కడికి వెళ్ళినా.. వదిన వదిన అనే పిలుస్తున్నారు”.. మెగా ఫ్యాన్స్ పిలుపు పై లావణ్య త్రిపాఠి షాకింగ్ రియాక్షన్..!!

సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు ఉన్నాయో మనకు తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు కొన్ని తరాలుగా మెగా ఫ్యామిలీ ఇండస్ట్రినీ ఏలేస్తుంది . రీసెంట్గా మెగా ఫ్యామిలీ లోకి అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠిని సైతం ఘనంగా స్వీకరించారు మెగా ఫ్యాన్స్. ఆమెకు ప్రత్యేక హోదా కల్పించారు . ఆమె ఎక్కడికి వెళ్ళినా సరే వదిన అంటూ ప్రేమగా ఆప్యాయంగా పిలుస్తూ వచ్చారు.

రీసెంట్గా మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా లావణ్య త్రిపాఠి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠి కు మెగా ఫ్యాన్స్ కి సంబంధించిన క్వశ్చన్ ఎదురైంది . మీరు ఎక్కడికి వెళ్ళినా వదిన అంటూ పిలుస్తున్నారుగా .. ఆ ఫీలింగ్ మీకు ఎలా ఉంది ..? దానిపై మీ రియాక్షన్ ఏంటి ..? అంటూ హోస్ట్ ప్రశ్నిస్తారు . దీంతో లావణ్య త్రిపాఠి చాలా ఎమోషనల్ గా స్పందిస్తుంది .

“నిజంగా బ్లెస్డ్ ..అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటి ప్రేమ దక్కించుకోవాలి అంటే అదృష్టం ఉండాలి . మెగా ఫ్యామిలీలో నేను కోడలుగా అడుగుపెట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.. అలాంటి ప్రేమ అభిమానాలు నాకు దక్కాయి.. ఈ లైఫ్ కి ఇది చాలు వాళ్ళు అంత ప్రేమగా వదినా అని పిలుస్తున్నారు.. సో స్వీట్ ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను ” అంటూ లావణ్య త్రిపాఠి చెప్పుకు వచ్చింది . దీంతో మెగా ఫాన్స్ మరోసారి లావణ్య త్రిపాఠిను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news