Movies"జస్ట్ మిస్ .. చావు నుంచి తప్పించుకున్న".. రష్మిక సెన్సేషనల్ పోస్ట్...

“జస్ట్ మిస్ .. చావు నుంచి తప్పించుకున్న”.. రష్మిక సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!!

రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది . ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాల్లో బిజీగా నటిస్తూ ఉన్నా రష్మిక మందన్నా.. అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా చిట్ చాట్ చేస్తూనే ఉంటుంది . రీసెంట్గా రష్మిక మందన్నా పెట్టిన పోస్ట్ అభిమానులకి టెన్షన్ పుట్టిస్తుంది .

రష్మిక తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో మరో హీరోయిన్ శ్రద్ధదాస్ ఉన్న ఫోటోని షేర్ చేస్తూ..” మీ సమాచారం కోసం ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము.. ఈరోజు మేము చావు నుంచి ఇలా తప్పించుకున్నాము “అంటూ చెబుతూ తమ కాళ్లని చూపిస్తూ ఒక పోస్ట్ పెట్టింది . ఈ పోస్ట్ వెనుక ఉన్న అర్థం ఏంటో తెలియదు కానీ ఇద్దరు కూడా జర్నీలో ఉన్నారు అని అర్థం అయింది .

అయితే అదే సమయంలోనే ఏదో ప్రమాదం జరిగింది అంటూ కూడా అర్థం అవుతుంది. ఆశ్చర్యమేంటంటే శ్రద్ధాదాస్ కూడా ఇదే పోస్టును షేర్ చేశారు . ప్రెసెంట్ రష్మిక అభిమానులు టెన్షన్ పడిపోతున్నారు . అసలు ఏమైంది పూర్తిగా చెప్పండి . ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రష్మిక ప్రసెంట్ మూడు తెలుగు నాలుగు బాలీవుడ్ సినిమాలతో బిజీ గా ముందుకు వెళ్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news