Moviesమెగా బ్లడ్ అంటే అదే.. ఆద్య చేసిన పనికి పవన్ ఫ్యాన్స్...

మెగా బ్లడ్ అంటే అదే.. ఆద్య చేసిన పనికి పవన్ ఫ్యాన్స్ ఫిదా(వీడియో)..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కూడా ఆయన దక్కించుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరి ఎవరు దక్కించుకోలేదని చెప్పాలి. ప్రెసెంట్ ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూతురు ఆధ్యా కూడా తండ్రి బాటలోనే పయనిస్తుంది అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అకిరా – ఆద్యాలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూనే ఉంటుంది రేణు దేశాయ్. రీసెంట్ గా ఆధ్యా కరాటే బాక్సింగ్ తరహాలో మార్షల్ ఆర్ట్స్ పంచులు విసురుతూ ఓ వీడియోలో కనిపిస్తుంది. ఆమె సరదాగా అలా పంచుల విసురుతున్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అయిపోతున్నారు.

తండ్రికి తగ్గ కూతురు అంటూ ఆయన బాటలోనే పయనిస్తుంది అంటూ ఆధ్య వీడియోని ట్రెండ్ చేస్తున్నారు. ఆద్య కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోందా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆద్య వీడియో వైరల్ గా మారింది. రీసెంట్ గా అన్న చెల్లెల్లు ఇద్దరూ మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలెబ్రేషన్స్ లో సందడి చేశారు. పవన్ కళ్యాణ్ పాటతో అకిరా, ఆద్య ఫోటోని కూడా రేణు దేశాయ్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news