Movies"ఊ అంటావా మావ" కన్నా ముందే.. సమంత ఐటమ్ సాంగ్ చేయాల్సిన...

“ఊ అంటావా మావ” కన్నా ముందే.. సమంత ఐటమ్ సాంగ్ చేయాల్సిన మూవీ ఏంటో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ చేయడం సర్వసాధారణం . కొంతమంది డబ్బు కోసం అలా చేస్తే మరి కొంతమంది తమ క్రేజ్ ని పాపులారిటీని పెంచుకోవడానికి అలా చేస్తూ ఉంటారు. రీజన్ ఏది ఏమైనాప్పటికీ స్టార్ హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ చేసి మెప్పించడం నిజంగా గర్వకారణం అని చెప్పాలి . కాగా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసిందే పుష్ప సినిమాలో హీరోయిన్ సమంత తన కెరియర్ లోనే ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ నటించింది . ఊ అంటావా మామ..ఊ ఊ అంటావ మావ అంటూ ఓ రేంజ్ లో ఊపేసింది . ఆమె ఊపిన ఊపుడు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం . అయితే ఈ పాట కన్నా ముందే సమంత మరొక సినిమాలో ఐటమ్ సాంగ్ చేయాల్సి ఉన్నింది . కానీ ఆమె ఆ ఆఫర్ను సున్నితంగా రిజెక్ట్ చేసిందట.

ఆ సినిమా మరేదో కాదు సరిలేరు నీకెవ్వరు . ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా చేసిన ఐటమ్ సాంగ్ సమంత చేయాల్సి ఉండిందట. కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో తమన్నా ఆఫర్ను అందుకుంది . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. మొత్తానికి ఊ అంటావా పాటతో దేశానే కుదిపేసింది సమంత. ప్రసెంట్ పలు సినిమాల్లో నటించడానికి రెడీగా ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news