Moviesబాల‌య్య - ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమా.. ఆ రెండు క‌థ‌లు ఇవే...!

బాల‌య్య – ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమా.. ఆ రెండు క‌థ‌లు ఇవే…!

హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు ఇప్పుడు ఏ రేంజ్‌లో మార్మోగిపోతోందో చూస్తున్నాం. ఒకే ఒక్క సినిమాతో ప్ర‌శాంత్ వ‌ర్మ పాన్ ఇండియా రేంజ్‌లో పాపుల‌ర్ అయిపోయాడు. ఈ క్ర‌మంలోనే ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో సినిమాలు చేసేందుకు ప‌లువురు ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు ముందు వ‌ర‌కు ప్ర‌శాంత్‌వ‌ర్మ‌ను ప‌ట్టించుకునే వాళ్లే లేరు. హ‌నుమాన్ సినిమాకు వ‌స్తోన్న వ‌సూళ్లు చూశాక టాలీవుడ్ సినీ జ‌నాల‌కు, ఇండ‌స్ట్రీకి దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అయినంత ప‌నైంది.

ఇదిలా ఉంటే ప్ర‌శాంత్ వ‌ర్మ – బాల‌య్య కాంబినేష‌న్లో సినిమా వార్త‌లు గ‌త యేడాది కాలంగా వినిపిస్తున్నాయి. వీరిద్ద‌రి మ‌ధ్య మంచి బాండింగ్ ఉంది. బాల‌య్య అన్‌స్టాప‌బుల్ టాక్ షో ప్రోమోతో పాటు కొన్ని ఎపిసోడ్ల టీజ‌ర్ల‌ను కూడా ప్ర‌శాంత్ వ‌ర్మే డైరెక్ట్ చేశాడు. ఈ చ‌నువుతోనే ప్ర‌శాంత్ వ‌ర్మ బాల‌య్య‌కు ఆల్రెడీ రెండు క‌థ‌లు వినిపించాడ‌ట‌. ఈ రెండు క‌థ‌ల్లో ఒక‌టి సూప‌ర్ హీరో క‌థ కాగా.. రెండోది మాస్ క‌థ అట‌.

హ‌నుమాన్ సినిమా స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ప్ర‌శాంత్ వ‌ర్మ ఆ జోష్లోనే బాల‌య్య సినిమా కోసం తాను రాసుకున్న రెండు క‌థ‌ల లైన్‌ను బ‌య‌ట పెట్టారు. హ‌నుమాన్ సినిమాతో సూప‌ర్ హీరో యూనివ‌ర్స్‌ని క్రియేట్ చేసిన ప్ర‌శాంత్ ఈ యూనివ‌ర్స్‌లో మొత్తం 12 సినిమాలు తీసుకు వ‌స్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇక బాల‌య్య‌తో చేసే సినిమా కూడా ఈ యూనివ‌ర్స్‌లోనే ఉంటుందా ? కాదా ? అన్న‌ది తెలియ‌దు.

ఇక బాల‌య్య కూడా ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇటీవ‌ల హ‌నుమాన్ సినిమా స్పెష‌ల్ షో వేసి మ‌రీ ప్ర‌శాంత్ వ‌ర్మ‌కు చూపించారు. ఈ సినిమా చూసిన బాల‌య్య ప్ర‌శాంత్ వ‌ర్మ‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. మ‌రి ప్ర‌శాంత్ వ‌ర్మ క‌థ‌కు బాల‌య్య ఎప్పుడు గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తారో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news