Moviesఎన్టీఆర్ దేవరకు మరో భారీ దెబ్బ.. అభిమానులకు ఊహించని బిగ్...

ఎన్టీఆర్ దేవరకు మరో భారీ దెబ్బ.. అభిమానులకు ఊహించని బిగ్ బ్యాడ్ న్యూస్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆర్ఆర్ఆర్ మూవీ లాంటి హిట్ పడిన తర్వాత తారక్ ఏ డైరెక్టర్ తో చేయబోతున్నాడా..? అంటూ ఫ్యాన్స్ బాగా ఈగర్ గా వెయిట్ చేశారు. అయితే ఆయన ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకుంటుంది . కాగా ఇలాంటి క్రమంలోనే దేవర సినిమా ఏప్రిల్ ఐదు రిలీజ్ కావడం లేదు అంటూ సోషల్ మీడియాలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు దేవర సినిమా ఆగస్టు 15న రిలీజ్ చేయాలి అంటూ మేకర్స్ ట్రై చేస్తున్నారట . కానీ ఆల్రెడీ అదే తేదీన పుష్ప 2 సినిమా రాబోతుంది.

కచ్చితంగా ఆ తేదీన విడుదల చేసే ఛాన్స్ అయితే ఉండదు. ఒకరోజు రెండు రోజు ముందు విడుదల చేస్తామన్న ఫ్యాన్స్ వారు మామూలుగా ఉండదు . ఈ క్రమంలోనే కొరటాల శివ ఎటువంటి అడ్డు లేకుండా సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. లేదంటే దసరా కానుకగా అక్టోబర్ లోనే రిలీజ్ చేస్తాము అంటూ ఫిక్స్ అవుతున్నారట . దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మరో బిగ్ షాక్ తగిలినట్లైంది. ఏప్రిల్ లో రావాల్సిన సినిమా అక్టోబర్ లో వస్తుంది అంటే అభిమానులకి ఎంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు . అయితే దీనిపై చిత్ర బృందం మాత్రం స్పందించకపోవడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news