Moviesఆ టాలీవుడ్ టాప్ హీరోయిన్ మ‌హేష్‌బాబుకు చెల్లి అవుతుందా... ఆ ట్విస్ట్...

ఆ టాలీవుడ్ టాప్ హీరోయిన్ మ‌హేష్‌బాబుకు చెల్లి అవుతుందా… ఆ ట్విస్ట్ ఇదే..!

ఈ టైటిల్ కాస్త చిత్రంగా అనిపించ‌వ‌చ్చు. టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఏంటి ? మ‌న సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుకు చెల్లి లెక్క ఏంట‌నుకుంటున్నారా… ఇది నిజ‌మే. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు ఒక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో టాలీవుడ్‌ను ఊపేసిన కీర్తిరెడ్డి. ఆలీ గ‌న్‌షాట్ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది. ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తొలిప్రేమ సినిమాతో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయ్యింది.

ఆ త‌ర్వాత ఆమెకు తిరుగులేని క్రేజ్ వ‌చ్చేసింది. నాగార్జున రావోయి చంద‌మామ సినిమాలోనూ న‌టించింది. కెరీర్ ప‌రంగా ఫామ్‌లో ఉన్న‌ప్పుడే మ‌హేష్‌బాబు హీరోగా వ‌చ్చిన అర్జున్ సినిమాలో మ‌హేష్‌కు చెల్లిగా న‌టించింది. ఆ సినిమా త‌ర్వాత మ‌హేష్ – కీర్తి మ‌ధ్య అన్నాచెల్లెళ్ల అనుబంధం ఏర్ప‌డింది. మ‌హేష్‌ను కీర్తి అన్నా అని పిల‌వ‌డం.. ఇటు మ‌హేష్ కూడా కీర్తిని సొంత చెల్లిలా చూసుకోవ‌డం జ‌రిగాయి.

కీర్తిరెడ్డి అక్కినేని హీరో సుమంత్‌ను ప్రేమ వివాహం చేసుకున్న‌ప్పుడు ముందుగా మ‌హేష్‌కు చెప్ప‌గా మ‌హేష్ కూడా సంతోషంగా నీ నిర్ణ‌యం గుడ్ అని చెప్పాడ‌ట‌. దుర‌దృష్ట‌వ‌శాత్తు కీర్తిరెడ్డి – సుమంత్ పెళ్లైన యేడాదికే మ‌న‌స్ప‌ర్థ‌ల నేప‌థ్యంలో విడాకులు తీసుకున్నారు. ఇక సుమంత్‌కు విడాకులు ఇచ్చేశాక కూడా మ‌రో వ్య‌క్తిని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిన కీర్తిరెడ్డి ఇప్ప‌ట‌కీ మ‌హేష్తో ట‌చ్‌లో ఉంటూ ఉంటుంద‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news