Moviesవెంక‌టేష్, మ‌హేష్ సేఫ్‌... నాగార్జున‌, ర‌వితేజను బ‌లి చేస్తున్నారా...!

వెంక‌టేష్, మ‌హేష్ సేఫ్‌… నాగార్జున‌, ర‌వితేజను బ‌లి చేస్తున్నారా…!

టాలీవుడ్ లో ప్రతి సంక్రాంతికి థియేటర్ల గోల తప్పట్లేదు. గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఈసారి సంక్రాంతికి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఐదు సినిమాలు రుమాలు వేసి వచ్చి తీరుతం అంటూ హడావుడి చేస్తున్నాయి. అయితే సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలకు స్కోప్ ఉంటుంది. ఏకంగా ఐదు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే థియేట‌ర్ల గొడ‌వ త‌ప్ప‌దు. కచ్చితంగా కలెక్షన్లపై ఎఫెక్ట్ తప్పదు. సూపర్ హిట్ అయిన సినిమాలకు కూడా వసూళ్లు తగ్గుతాయి. ఈ టైంలో ఎవరూ వెనక్కి తగ్గకపోతే కొందరు సేఫ్ అయితే.. కొందరు మాత్రం బలికాక తప్పదు.

వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్‌, రవితేజ ఈగిల్, నాగార్జున నా సామి రంగా, హనుమాన్ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. 12న రెండు సినిమాలు, 13న రెండు సినిమాలు, 14న ఒక సినిమా రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. గుంటూరు కారంకు మహేష్ బాబు హీరో, త్రివిక్రమ్ దర్శకుడు ఆ సినిమాకు బాగా థియేటర్‌లు దొరుకుతున్నాయి. సైంధవ్‌కు వెంకటేష్ హీరో. సురేష్ బాబు తో పాటు ఆషియన్ సునీల్ బ్యాకప్ ఉంది. కావాల్సినన్ని థియేటర్లు ఉన్నాయి. వెంకటేష్ కూడా వెనక్కి తగ్గటం లేదు.

ఇక ఈ పోటీలో బలయ్యేది రవితేజ, నాగార్జున అని తెలుస్తోంది. రవితేజ ఈగిల్‌కు అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరకటం లేదు. ఈ సినిమాను నిర్మిస్తోన్న పీపుల్స్ మీడియా రంగంలోకి దిగి కొన్నిచోట్ల థియేటర్లకు అగ్రిమెంట్లు చేయటం ప్రారంభించింది. ఇక హనుమాన్ సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని గట్టిగా తీర్మానించుకున్నారు. ఈ సినిమాకు థియేటర్ల‌ అగ్రిమెంట్ మొదలుపెట్టినా అనుకున్నట్టుగా దొరకటం లేదు. అయితే అయోధ్య‌లో రామ‌మందిరి ప్రారంభోత్స‌వానికి ముందే ఈ సినిమాను రిలీజ్ చేయాల‌ని గ‌ట్టిగా డిసైడ్ అవ్వ‌డంతో వాళ్ల‌కు అంత‌కు మించి ఆప్ష‌న్లు క‌న‌ప‌డ‌డం లేదు.

ఇక ఇంత గట్టి పోటీలో నాగార్జున నా సామిరంగా సినిమా పరిస్థితి కూడా అంతేలే ఉంది. అయితే నాగార్జున, రవితేజ వెనక్కు తగ్గాలని ఒత్తిళ్ళు వస్తున్న తమ సినిమాలపై ఉన్న కంటెంట్ పై ధీమాతో వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటున్నారు. ఏది ఏమైనా థియేటర్ల కోసం ఎన్ని యుద్ధాలు జరిగినా అంతిమంగా సినిమా రిలీజ్ అయ్యాక ఇక్కడ విన్నర్ ఎవరు ? అన్నది కంటెంట్ తేల్చనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news