Moviesత‌న తండ్రి కంటే ముందే రాజ‌మౌళి ఎవ‌రి ద‌గ్గ‌ర శిష్యుడిగా చేశాడో...

త‌న తండ్రి కంటే ముందే రాజ‌మౌళి ఎవ‌రి ద‌గ్గ‌ర శిష్యుడిగా చేశాడో తెలుసా…!

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజ‌మౌళి తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా ఎల్లలు దాటించేసి.. ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారు. ఈ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డ్‌ కూడా సొంతం చేసుకున్నారు. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్‌ఆర్ఆర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత ? బ్లాక్ బస్టర్ హిట్ అయిందో.. అలాగే ఆస్కార్ అవార్డ్‌ గెలుచుకుని మరి తెలుగోడి సత్తా ఏంటి.. తెలుగు సినిమా గొప్పతనం ఏంటో.. ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్‌ రావడంతో రాజమౌళిపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పాలి.

2001లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో మెగా ఫోన్ పట్టిన రాజమౌళి.. తన కెరీర్‌లో ఇప్పటివరకు అపజయం అన్నదే లేకుండా వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు రాజమౌళి నుంచి సినిమా వస్తుంది అంటే చాలు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో రాజమౌళికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక రాజమౌళికి ఇండస్ట్రీలో తొలి గురువు ఎవరు ? అంటే.. అందరూ సహజంగానే ఆయన తండ్రి స్టార్ స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ అనుకుంటారు.

అంతకంటే ముందే రాజమౌళి ఓ టాప్ టాలీవుడ్ టెక్నీషియన్ దగ్గర శిష్య‌రికం చేశారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. రాజమౌళి సినిమాల్లోకి రావాలన్నా ఉత్సాహాన్ని వ్యక్తం చేసినప్పుడు విజయేంద్ర ప్రసాద్.. ఆయనను కోటిగిరి వెంకటేశ్వరరావు దగ్గర అసిస్టెంట్‌గా పెట్టారు. ఆ టైంకు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ప‌రిస్థితి ఏమంత గొప్ప‌గా లేదు. కొన్నాళ్లపాటు కోటగిరి దగ్గర ఎడిటింగ్‌లో మెళుకువ‌లు నేర్చుకున్నాడు రాజమౌళి.

ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసి ఆయన నిర్మించిన శాంతినివాసం సీరియల్‌తో మెగాఫోన్ పట్టి దర్శికుడిగా తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఆ టైంలోనే రమా రాజమౌళితో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఇక తన రెండో సినిమా సింహాద్రితోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి అస్సలు వెనక్కి తిరిగి చూసుకోలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news