Newsఅల్లు అర్జున్ అంటే పిచ్చి అభిమానతో ఈ ఫ్యాన్ ఏం చేసిందో...

అల్లు అర్జున్ అంటే పిచ్చి అభిమానతో ఈ ఫ్యాన్ ఏం చేసిందో చూడండి.. వైరల్ అవుతున్న ఆర్టిస్ట్ టాలెంట్(వీడియో)..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ ను అభిమానులు ఏ రేంజ్ లో ఇష్టపడతారో మనకు తెలిసిందే . కొందరు పుట్టిన రోజులకు రక్తదానం ..అన్నదానం చేస్తే.. మరి కొందరు వాళ్ళ కోసం పుట్టినరోజు నాడు భారీ భారీ ఫ్లెక్సీలతో కటౌట్లతో హంగామా చేస్తూ ఉంటారు . అభిషేకాలు చేస్తూ ఉంటారు . అయితే ఇక్కడ ఈ ఫ్యాన్ మాత్రం వెరైటీగా చేసింది. అల్లు అర్జున్ అంటే పిచ్చి అభిమానం కల ఓ ఆర్టిస్ట్ నీటిపై వేసిన బన్నీ బొమ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అభిమాన హీరో సినిమా రిలీజ్ అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనుకునే అభిమానులు ఉంటారు కానీ.. ఈ విధంగా ప్రాణం పెట్టి మరి అచ్చు గుద్దినట్లు బన్నీ బొమ్మను దించడం చాలా చాలా గ్రేట్ అంటున్నారు అభిమానులు . అల్లు అర్జున్ వీరాభిమానులు చాలామంది ఉన్నారు . వాళ్ళల్లో ఒకరే ఈ ఆర్ట్ వేసిన అమ్మాయి . పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ కి సంబంధించిన ఓ పిక్చర్ ను పళ్లెంలో ఉన్న నీటిపై రంగులతో వేసి అల్లు అర్జున్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నింది.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు బన్నీ ఫ్యాన్స్ తగ్గేదేలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు . కాగా పుష్ప 2 సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమా కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news