Moviesపుండు మీద కారం చల్లిన ప్రభాస్.. రోమాలు నిక్కబొడ్చుకునేలా రెబల్ ఫ్యాన్స్...

పుండు మీద కారం చల్లిన ప్రభాస్.. రోమాలు నిక్కబొడ్చుకునేలా రెబల్ ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్(వీడియో)..!

అసలే సలార్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా మిగతా హీరోల ఫాన్స్ కు మండిపోయేలా చేస్తుంది. మరీ ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఏం పీకలేడు అన్న వాళ్లకు ప్రభాస్ సైలెంట్ గానే రాడ్ దింపేశాడు . సలార్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా కెరీర్ లో ఎన్నో అద్భుతమైన మైల్ స్టోన్ ను రీచ్ అయ్యాడు .

కలెక్షన్స్ పరంగా కూడా సలార్ దుమ్ము దులిపేస్తుంది . ఏ హీరో టచ్ చేయలేని రికార్డ్స్ సైతం క్రియేట్ చేస్తుంది. దీనితో రెబల్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు . మిగతా హీరోల ఫ్యాన్స్ బాధపడిపోతూ డీలా పడిపోయారు. అలాంటి వాళ్లకి పుండు మీద కారం చల్లుతున్నట్లు ప్రభాస్ రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది ప్రభాస్ అభిమానులకు రోమాలు నిక్కబడుచుకునేలా చేస్తుంది.

ప్రభాస్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సలార్ సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియో కొద్దిసేపటి క్రితమే మేకర్స్ రిలీజ్ చేశారు . ఈ వీడియోలో ప్రభాస్ కష్టపడిన తీరు అందరి కళ్ళకి బాగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ప్రభాస్ ఒక్కొక్క షాట్ కోసం ఎంత కష్టపడ్డారు ఎన్ని గంటలు ఆ షాట్ కోసం రిహాసర్ల్స్ చేశారు అన్న విషయం మేకింగ్ వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది.

అంతేకాదు ప్రశాంత్ నీల్ కూడా ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు అని ఒక్క వీడియోతోనే తెలిసిపోతుంది . సినిమా ఇంత హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ టీం వర్క్ అంటూ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సలార్ మేకింగ్ వీడియోలో ఫైట్ సీన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ .. ఫైట్ మాస్టర్ చేసే పోరాటాలు ..మ్యూజిక్ డైరెక్టర్ చేసిన మ్యాజిక్ .. నటీనటుల పర్ఫామెన్స్ ఈ సినిమాని ఈ స్థాయిలో నిలబెట్టడానికి కారణం అంటూ ఒక్క వీడియోతో క్లియర్ కట్ గా చూపించేశాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news