Movies"ఇప్పుడు చెప్పవయ్య వేణు స్వామీ తల ఎక్కడ పెట్టుకుంటావ్..?".. అడిగి కడిగి...

“ఇప్పుడు చెప్పవయ్య వేణు స్వామీ తల ఎక్కడ పెట్టుకుంటావ్..?”.. అడిగి కడిగి పారేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్..!!

రెబల్ ఫ్యాన్స్ చాలా సైలెంట్ పర్సన్స్ ..ఎవ్వరి జోలికి వెళ్ళరు. తమ జోలికి వస్తే ఊరుకోరు. అది అందరికీ తెలిసిందే . అయినా సరే కావాలనే కొందరు రెబెల్ ఫాన్స్ ని గిల్లి గిచ్చి తిట్టించుకుంటూ ఉంటారు . వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా సలార్. కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాహుబలికి 1000 రెట్లు హిట్లు తన ఖాతాలో వేసుకుంది .

బాహుబలి తర్వాత అలాంటి హిట్ కోసం వెయిట్ చేసిన ప్రభాస్ కి మంచి కం బ్యాక్ మూవీ అనే చెప్పాలి . ఈ సినిమాలో కర్త – కర్మ – క్రియ అన్ని తానై పోషించాడు ప్రభాస్. సినిమాలో జగపతిబాబు పృథ్వీరాజ్ లాంటి స్టార్ పర్సన్స్ ఉన్నా కూడా అందరి కళ్లు ప్రభాస్ వైపే మళ్లాయి. దానికి మెయిన్ రీజన్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం. ఒక్కొక్క సీన్లో గూస్ బంప్స్ తెప్పించే విధంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని ఎలివేట్ చేయడమే కాకుండా ప్రభాస్ నుంచి అభిమానులు ఏం కోరుకుంటున్నారో పర్ఫెక్ట్ గా అదే విధంగా తెరకెక్కించాడు .

దీంతో సోషల్ మీడియాలో సలార్ సినిమాకి సంబంధించిన టాక్ వైరల్ అవుతుంది . అయితే ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామిని ఏకిపారేస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యే ముందు వేణు స్వామి చేసిన కామెంట్స్ తెలిసిందే . “సలార్ సినిమా దొబ్బేస్తుంది అని ..ఆయనకు అంత సీన్ లేదు అని ..అసలు ఆ సినిమాకి డిపాజిట్లు కూడా రావు ..అన్నంత రేంజ్ లో కామెంట్స్ చేశారు”. అప్పట్లోనే ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయం పై బాగా మండిపడ్డారు .

అయితే కొంతమంది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామిని ఫుల్ గా టార్గెట్ చేసే ట్రోల్ చేస్తున్నారు . ఇప్పుడు చెప్పు నీ జాతకం ..? నువ్వు చెప్పిందంతా అబద్ధం ..ఏవో కొందరు విడాకులు తీసుకున్నారు కదా అని చెప్పి ..నువ్వు చెప్పినవన్నీ నిజమవ్వాలని ఉందా..? ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటావు వేణు స్వామి ..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. మరికొందరు వేణు స్వామి ఇక జాతకాలు చెప్పకుండా ఆపేస్తే బెటర్ అంటూ సలహా ఇస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news