Newsవార్నీ..పాయల్ చెవిలో బన్నీ చెప్పింది అదా..? సిగ్గులేదా రా మీకు..?

వార్నీ..పాయల్ చెవిలో బన్నీ చెప్పింది అదా..? సిగ్గులేదా రా మీకు..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రెటీస్ ల పై కూసింత ఫోకస్ ఎక్కువగానే చేస్తున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ఎవరైనా స్టార్ సెలెబ్రిటీ ఏదైనా ఈవెంట్ కి వెళితే మాత్రం కచ్చితంగా .. అక్కడ ఆయన ఏ బిహేవియర్ తో నడుచుకున్నాడు అన్న దానిపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు . రీసెంట్గా అల్లు అర్జున్ మంగళవారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు .

ఈ ఈవెంట్ లో చాలా సరదాగా కనిపించిన బన్నీ పాయల్ ను దగ్గరకు తీసుకొని చెవిలో ఏదో చెబుతున్నట్లు కనిపిస్తాడు . అయితే దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది . అసలు పాయల్ రాజ్ పుత్ చెవిలో బన్నీ ఏం చెప్పాడు అంటూ తెగ చర్చలు నడిచాయి. దీంతో ఫైనల్లీ దానిపై క్లారిటీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్.

” బన్నీ నా సినిమాలు చూసి నన్ను మెచ్చుకున్నారు .. ఈ సినిమా పాత్ర గురించి నాకు తెలుసు.. నువ్వు ఈ పాత్రలో లీనమైపోయి నటించి ఉంటావు.. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ “అంటూ చెప్పుకొచ్చాడు అన్న విషయాన్ని బయటపెట్టింది . దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇన్నాళ్లు తెగ రచ్చ చేశారు.. ఇదేరా మా బన్ని చెప్పింది . ఇకనైనా కళ్ళు తెరుచుకోండి.. ఎవరైతే మా బన్నీని ట్రోల్ చేశారో వాళ్లకి సిగ్గు లేదు అని ఒప్పుకోండి అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news