Newsఅనుష్క చివ‌రి సినిమా ఇదే... అది కూడా వాళ్ల కోస‌మే ఒప్పుకుందా...!

అనుష్క చివ‌రి సినిమా ఇదే… అది కూడా వాళ్ల కోస‌మే ఒప్పుకుందా…!

ఫేస్ ఆఫ్ ది సినిమాగా చెప్పుకునేది హీరోనే అయితే ఆ హీరోలకు సమానంగా ఇమేజ్ తెచ్చుకున్న స్టార్ హీరోయిన్లు అరుదుగా వస్తుంటారు. అలాంటి అరుదైన హీరోయిన్‌ల‌లో అనుష్క శెట్టి ఒకరు. 2005లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో ఆమె హీరోయిన్గా పరిచయమైంది. ఆ తర్వాత ఆమె టాలీవుడ్లో 10 ఏళ్లకు పైగా ఒక వెలుగు వెలిగింది. తెలుగు, తమిళ, కన్నడలో స్టార్ హీరో లో అందరితోను నటించి సూపర్ డూపర్ హిట్లు కొట్టింది.

కేవలం హీరోల పక్కన హీరోయిన్గా నటించడమే కాదు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి కూడా తానేంటో ప్రూవ్ చేసుకుంది. అరుంధతి, రుద్రమదేవి, భాగమతి సినిమాలు ఆమె స్థాయి ఏంటో చాటి చెప్పాయి.
రీసెంట్గా చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటించిన మిస్ శెట్టి … మిస్టర్ పోలిశెట్టి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అందుకుంది. అనుష్క వయసు ఇప్పటికే నాలుగు ప‌దులు దాటేసింది. ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు. అనుష్క పెళ్లి ఎప్పుడు ? అన్నది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది.

సౌత్ ఇండియా మీడియోతో పాటు సౌత్ ఇండియా సోషల్ మీడియాలో అనుష్క పెళ్లి జరుగుతుందా.. ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటుంది.. ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకుంటారా ? అన్న ప్రశ్నలే పెద్ద మిస్టరీగా మారిపోయాయి. ఇప్పటికే అనుష్క ఫేస్‌లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె బాగా లావు ఎక్కిపోయింది. ఆమె సినిమాలో నటిస్తున్నారంటే భారీగా సీజీ వర్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అయితే యూవి క్రియేషన్స్ చిరంజీవి హీరోగా నిర్మిస్తున్న సినిమాలో అనుష్క నటిస్తోంది.

ఆ సినిమా తర్వాత త్వరలోనే అనుష్క 50వ సినిమా కూడా ఉంటుందని. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భాగమతి 2 సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. తన 50వ సినిమా తర్వాత అనుష్క సినిమాలు గుడ్ బై చెప్పేస్తుందన్న ప్రచారం కూడా జరుగుతుంది. కేవలం ఆమె చివరి రెండు సినిమాలు కూడా తనకు అత్యంత సన్నిహితులైన యూవీ క్రియేషన్స్ వాళ్ళ కోసమే చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news