Newsవకీల్ సాబ్ లో జడ్జ్ గా చేసిన మీర్ కి నటి...

వకీల్ సాబ్ లో జడ్జ్ గా చేసిన మీర్ కి నటి హేమ కి ఉన్న రిలేషన్ ఇదే..!

మీర్..ఈ పేరు అంతగా అందరికీ తెలియకపోవచ్చు. కానీ, ఆయన బుల్లితెర సీరియల్స్ పరంగా మాత్రం బాగా పాపులర్. మీర్ పాపులర్ సినిమాటోగ్రాఫర్. ఆయన ఒకదశలో స్మాల్ స్క్రీన్ మీద వచ్చే సీరీయల్స్ కి కెమెరా మేన్ గా పనిచేశారి. ఆయన ముస్లిం. అయినా ప్రముఖ సీనియర్ నటులు నాగభూషణం గారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.

అంతేకాదు, ముస్లిం అయినా అస్సలు నాన్ వెజ్ తినరౌ. అంతేకాదు, వెంకటేశ్వర స్వామికీ పరమ భక్తుడు. ఎవరిని పిలిచినా గోవిందా అనే సంభోధిస్తారు. అయ్యప్ప మాల ధరిస్తారు. ఒక ముస్లిం ఫ్యామిలీలో పుట్టి ఇలా హిందూ సాంప్రదాయాలను పాటించడం, గౌరవించడం చాలా అరుదు. ఇక మీర్ గురించి సీనియర్ నటీమణులు ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. బెంగుళూరు పద్మ, రవళి, జాకీ లాంటి ఎందరో మీర్ అంటే అపారమైన గౌరవాన్ని ప్రదర్శిస్తారు.

నటి హేమ మీర్ గారికి మరదలు అవుతుంది. మీర్ ఎంత సౌమ్యంగా ఉంటారో ఆ ఫ్యామిలీ వాళ్ళు అలాగే ఉంటారు. కానీ ఆ ఫ్యామిలీలో ఫైర్ బ్రాండ్ అంటే ఒక్క హేమ మాత్రమే. ఆమె ఎన్ని కాంట్రవర్సీలకి వెళ్ళినా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా మీర్ ఒక్క మాట అనరు. పైగా ఫ్యామిలీలో ఇలాంటి వాళ్ళు ఒకరు ఉండాలిగా..అంటూ హేమకి సపోర్ట్ చేస్తారు.

ఇక మీర్ నటుడిగా కూడా బాగా పాపులర్. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో జడ్జ్ పాత్ర పోషించారు. వాస్తవానికి ఈ పాత్రను ప్రముఖ సీనియర్ నటుడితో చేయించాలనుకున్నారట. కానీ, దర్శకుడు వేణు శ్రీరాం మీర్ అయితేనే బావుంటుందని ఫైనల్ గా ఆయనని జడ్జ్ పాత్రకి తీసుకున్నారు. 6 కెమెరాలు పెట్టి ఒకే షాట్ ని అన్నీ యాంగిల్స్‌లో షూట్ చేయడం..ఆ లైటింగ్..అంతా చూసి షాకయ్యాని చెప్పారు మీర్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news