Newsశ్రీలీల బెస్ట్‌... ర‌ష్మిక వేస్ట్‌... నితిన్ సెటైర్ల‌కు అదే కార‌ణ‌మా...?

శ్రీలీల బెస్ట్‌… ర‌ష్మిక వేస్ట్‌… నితిన్ సెటైర్ల‌కు అదే కార‌ణ‌మా…?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ – రష్మిక కాంబినేషన్లో వచ్చిన భీష్మ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మ‌ళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతున్నట్టు ప్రచారం జరిగింది. వెంకీ కుడుముల‌ దర్శకత్వంలో నితిన్ – రష్మిక మరోసారి కలిసి నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. అయితే సడన్గా ఈ ప్రాజెక్టు నుంచి రష్మిక తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి.

ఈ పుకార్ల‌పై క్లారిటీ ఇచ్చిన నితిన్.. ఈ వార్తలన్నీ నిజమే అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తన కొత్త సినిమాలో రష్మిక లేదని స్పష్టం చేశాడు. అయితే మరి ఈ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరు అన్న ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ ఇస్తూ నితిన్ ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. ఈ క్రమంలోనే రష్మికపై పరోక్షంగా సెటైర్లు వేశాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ల కొర‌త ఉంద‌న్న నితిన్.. చాలామంది హీరోయిన్లు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారంటూ పరోక్షంగా రష్మికపై సెటైర్లు వేశాడు.

చివరకు శ్రీ‌లీలను తమ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నట్టు చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం నితిన్ శ్రీలీల‌తో కలిసి వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో నటించారు. త్వరలోనే వెంకీ కుడుముల సినిమాతో మరోసారి శ్రీ‌లీల – నితిన్ జంట‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏది ఏమైనా నితిన్‌ బాలీవుడ్‌లో నటిస్తున్నారు అంటూ పరోక్షంగా రష్మికను ఉద్దేశించి ఎద్దేవా చేశాడు.. అన్న గుసగుసలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

రష్మిక.. పుష్ప 2 సినిమాతో పాటు రెయిన్‌బో అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఇక బాలీవుడ్‌లో రణబీర్ కపూర్ కి జోడిగా యానిమల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్లో రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న మ‌రో సినిమాలోనూ న‌టిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news