News' యానిమ‌ల్ ' సినిమా చిరంజీవి హిట్ సినిమాకు కాపీనా... అడ్డంగా...

‘ యానిమ‌ల్ ‘ సినిమా చిరంజీవి హిట్ సినిమాకు కాపీనా… అడ్డంగా దొరికేశారు…!

బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్.. సౌత్ ఇండియన్ హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమా హిందీతో పాటు.. సౌత్ లాంగ్వేజెస్ లో భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అయితే ఈ ట్రైలర్ చూసిన మెగా అభిమానులు ఇప్పుడు చిరంజీవి పాత సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. ఆ సినిమాకు యానిమ‌ల్‌కు లింక్ ఉంద‌ని చ‌ర్చించుకుంటున్నారు.

ఆ సినిమా ఏదో కాదు కిరాతకుడు. కిరాతకుడు సినిమా తండ్రి, కొడుకు బంధంతో తెరకెక్కింది. ఇప్పుడు యానిమల్ సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని తెలుస్తోంది. తండ్రి ఎలా చూడాలనుకుంటున్నాడో దానికి విరుద్ధంగా కొడుకు పెరుగుతాడు. ఒక దశలో మనం క్రిమినల్‌ని కన్నాం అని అంటాడు తండ్రి. కొడుక్కి మాత్రం తండ్రి అంటే చాలా ప్రేమ. తన తండ్రి కోసం కొడుకు ఏం చేశాడు.. ఈ క్రమంలో అతడు ఎంత వైలెంట్ గా మారాడు.. అనేది యానిమల్ సినిమా.

చిరంజీవి హీరోగా నటించిన కిరాతకుడు సినిమా కూడా దాదాపు ఇలాంటి కథనే పోలి ఉంటుంది. తండ్రి ఉన్నత స్థితిలో ఉంటే కొడుకు మాత్రం తప్పుడు దారిలోకి ఎంటర్ అవుతాడు. స్మగ్లింగ్ లాంటి పనులు చేస్తూ చివరికి తండ్రిని రక్షించుకొని తనకు తండ్రి పై ఉన్న ప్రేమ ఎలాంటిదో తెలియజేస్తాడు. ట్రైలర్లో రణబీర్ కపూర్ షాట్స్.. కిరాతకుడులో చిరంజీవి షార్ట్స్ ను.. కంపేరిజన్ చేస్తూ మెగా అభిమానులు సోష‌ల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు.

ఈ రెండు సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటి అంటే.. తండ్రి ఆశయాలకు విరుద్ధంగా కొడుకు రెబల్గా తయారవుతాడు. ఈ ఒక్క కామన్ పాయింట్‌తో మెగా అభిమానులు ఆసక్తికర చర్చ‌కి తెరలేపారు. ఇక యానిమల్ సినిమా రన్ టైం విషయంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరో రెండు రోజుల‌లో తేలిపోనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news