Movies"ఇండస్ట్రీలో రియల్ హీరో అయనే"..సైలెంట్ గానే మంట పెట్టిన సమంత..!!

“ఇండస్ట్రీలో రియల్ హీరో అయనే”..సైలెంట్ గానే మంట పెట్టిన సమంత..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ఏం మాట్లాడినా అది సెన్సేషన్ గానే మారిపోతుంది . మరీ ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటినుంచి సమంత పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు కొందరు జనాలు . ఆమె ఎక్కడికి వెళ్తుంది..? ఎవరిని మీట్ అవుతుంది ..? ఎలాంటి పనులు చేస్తుంది ..? ఎలాంటి పోస్ట్ పెడుతుంది..? అన్నదానిపై ఎక్కువగానే ఫోకస్ పెడుతున్నారు .

రీసెంట్గా సమంత ది మార్వెల్స్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయింది . ఈ క్రమంలోనే మీడియా రిపోర్టర్ లు ఆమెను పలు విధాలుగా ప్రశ్నించారు . ఓ రిపోర్టర్ సమంతను ప్రశ్నిస్తూ..” తెలుగులో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లాగ ఒక సూపర్ హీరో సిరీస్ నిర్మిస్తే మీరు సూపర్ హీరోలుగా ఎవరిని ఎంచుకుంటారు ..?” అంటూ ప్రశ్నించారు . దీనికి సమంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇస్తూ..

” నాకు అల్లు అర్జున్ అంటే పిచ్చి . అతనే నా సూపర్ హీరో .. ఆయనతో పాటు విజయ్ దేవరకొండ కూడా” అంటూ సమాధానం ఇచ్చి.. అందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సమంత నుంచి ఇంత బోల్డ్ స్టేట్మెంట్ జనాలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే సమంతకు సంబంధించిన ఈ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు . మొత్తానికి సమంత ఇండస్ట్రీలో తోపైన హీరోలు అల్లు అర్జున్ – విజయ్ దేవరకొండ అంటూ చెప్పకనే చెప్పేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news