News"రేయ్..సిగ్గు లేదా రా నానిగా..?".. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ...

“రేయ్..సిగ్గు లేదా రా నానిగా..?”.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పరువు మొత్తం పొగొట్టుకునేసిన నాచురల్ స్టార్..!!

తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు భారీ అంచనాలు పెట్టుకొని ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇంకేదో అనుకుంటూ సినిమా ప్రమోషన్స్ లో స్టార్ట్ చేసిన నాని కు సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ ట్రోలింగ్ ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది . నిన్న మొన్నటి వరకు హాయ్ నాన్న సినిమాపై హ్యూజ్ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి . పలువురు స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా నాని ను ప్రమోట్ చేయడానికి సిద్ధపడ్డారు . అయితే రీసెంట్ గా వైజాగ్ లో హాయ్ నాన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ఓ ఇన్సిడెంట్ ఇప్పుడు అభిమానులకు కోపం తెప్పిస్తుంది .

మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు ఒళ్ళు మండిపోయేలా చేస్తుంది. హీరో నాని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్న తాజా సినిమా హాయ్ నాన్న. డిసెంబర్ 7వ తేదీ ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే వైజాగ్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ ను బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు మేకర్స్. అయితే ఈ ఈవెంట్లో అనుకోకుండా స్క్రీన్ పై రష్మిక మందన్నా – విజయ్ దేవరకొండ పర్సనల్ ఫోటోను రివిల్ చేశారు .

నిజానికి ఈ సినిమాకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు . అనవసరంగా ఆ ఫోటోని అక్కడ టెలికాస్ట్ చేయించి సినిమా ప్రమోషన్స్ కోసం వారిని వాడుకున్నారు . అయితే యాంకర్ సుమ పరిస్థితిని చక్క దిద్దేందుకు పక్కనే ఉన్న ఫోటోగ్రాఫర్ తో ” ఇలాంటి ఫోటోలు రా నువ్వు తీసేది స్టార్ సెలబ్రిటీస్ కి ప్రైవసీ ఇవ్వవా..?” అంటూ మ్యాటర్ ని కూల్ చేసింది . అయితే ఆ ఫోటో స్క్రీన్ పై రాగానే నాని నవ్వుకోవడం మృణాల్ ఠాకూర్ షాక్ అవ్వడం ఇప్పుడు అభిమానులకు కోపం తెప్పిస్తుంది.

మృణాల్ ఠాకూర్ షాక్ అయిన పద్ధతి ఓకే ..నాని ఎందుకు నవ్వుకోవాలి ..అసలు అక్కడే చెప్పేయాలి ..ఇలాంటి ఫొటోస్ వేయకూడదు.. అది మంచిది కాదు అని.. మీ సినిమా పబ్లిసిటీ కోసం పక్క వాళ్ళ ప్రైవసీను వాడుకుంటావా ..?సిగ్గు లేదా..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు . దీంతో హీరో నాని హాయ్ నాన్న సినిమా రిజల్ట్ పై కొత్త బెంగ పట్టుకునింది అభిమానులకు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news