Movies"నా ప్రేమకు విలన్ వాడే.. నా లవర్ ని ఎగరేసుకుపోయాడు"..రక్షిత్ శెట్టి...

“నా ప్రేమకు విలన్ వాడే.. నా లవర్ ని ఎగరేసుకుపోయాడు”..రక్షిత్ శెట్టి సంచలన కామెంట్స్ వైరల్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినీ స్టార్స్ కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా టాప్ సెలబ్రిటీస్ లో ప్రేమ – పెళ్లి – బ్రేకప్ విడాకుల విషయాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజుకి 10 వార్తలైనా సరే ట్రెండ్ లో ఉంటానే ఉంటాయి . కాగ రీసెంట్గా రష్మిక మందన్నా మాజీ బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టి కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

చార్లీ 777 మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన రక్షిత్ శెట్టి రీసెంట్ గా సప్త సాగరాలు దాటి మూవీతో మరింత దగ్గర అయిపోయాడు . ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంది. సప్త సాగరాలు దాటి సైడ్ బి నవంబర్ 17న రిలీజ్ కాబోతుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రక్షిత్ శెట్టి మాట్లాడుతూ తన లవ్ ఎఫైర్స్ గురించి ఓపెన్ అప్ అయ్యాడు. రష్మిక కంటే ముందే ఆయన మరో అమ్మాయిని కూడా ప్రేమించాడట .

అప్పుడు ఆయన స్నేహితుడు ఆయనను మోసం చేశాడట . రక్షిత్ శెట్టి ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్నప్పుడు.. ఆ అమ్మాయిని ఇష్టపడ్డారట. ఆ అమ్మాయికి తన ప్రేమను తెలియజేయడానికి లవ్ లెటర్స్ కూడా రాసేవాడట. ఆ అమ్మాయికి ఇవ్వమని తన క్లోజ్ ఫ్రెండ్ కి ఇస్తే ఆ అబ్బాయి ఇవ్వకుండా మోసం చేశాడట . రెండేళ్లయినా ఎందుకు ఆ అమ్మాయి రెస్పాండ్ అవ్వట్లేదు అని మేటర్ ఆరా తీస్తే ఆ ఫ్రెండ్ ఒకటి కూడా అమ్మాయికి ఇవ్వలేదని ..కట్ చేస్తే తన ఫ్రెండ్ ఆ అమ్మాయి ఇప్పుడు భార్యాభర్తలు అని చెప్పుకు వచ్చారు. అలా క్లోజ్ ఫ్రెండే చీట్ చేసి తన లవర్ ని ఎగరేసుకుపోయాడు అని సంచలన కామెంట్స్ చేశాడు రక్షిత్ శెట్టి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news