Moviesబిగ్ షాకింగ్: ఈసారి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే...

బిగ్ షాకింగ్: ఈసారి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలుసా..? కలలో కూడా ఊహించి ఉండరు..!!

బిగ్బాస్ సీజన్ సెవెన్ ఎంత రసవత్తరంగా సాగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా ఈసారి హౌస్ లో మహా మహా నటులే ఉన్నారు అంటూ జనాలు సైతం కామెంట్స్ చేస్తున్నారు . కాగా పోయిన వారం బోలే షో నుంచి ఎలిమినేట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈసారి హౌస్ లో ఉన్న టాప్ కంటెస్టెంట్లలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అన్నదానిపై ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది .

రీసెంట్గా నామినేషన్ లిస్టులోకి వచ్చిన టాప్ సెలబ్రిటీస్ చూస్తే ఈసారి అభిమానులకు బిగ్ షాక్ తప్పదు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. కెప్టెన్ అయిన శివాజీ అలాగే రైతుబిడ్డగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ తప్పిస్తే మిగతా హౌస్ మేట్స్ అందరూ నామినేట్ అయ్యారు . అయితే అమర్ ,యావర్ ,గౌతమ్, అర్జున్ నలుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో ఓట్ల పరంగా వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు .

ఇక ప్రియాంక శోభాలను మాటీవీ ఎప్పటినుంచో కాపాడుతూ వస్తుంది . కాబట్టి వాళ్లు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు . ఇక మిగిలింది రతిక లేదా అశ్విని ..ఈ ఇద్దరు లో ఖచ్చితంగా ఒకరు ఎలిమినేట్ అవుతారు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ వారం రతిక ఎలిమినేట్ అవ్వక తప్పదు అంటూ జనాలు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news