Newsజూ ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం.. ఎలా చెప్పాలో తెలియక ఈ...

జూ ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం.. ఎలా చెప్పాలో తెలియక ఈ ఫ్యాన్ ఏం చేశాడో చూడండి.. రియల్లీ గ్రేట్..!!

ప్రతి ఒక్కరికి ..ఒక్కొక్క స్టార్ హీరో అంటే ఇష్టం ఉంటుంది . ఆ హీరో కోసం ఏమైనా చేయాలి అని ..తాపత్రయం ఆశ అందరికీ ఉంటుంది . అయితే ఆ విషయంలో నందమూరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూసింత ఎక్కువగానే ఉంటారు . తమ ఫేవరెట్ హీరోకి అనేక రకాలుగా వాళ్లకు తమపై ఉన్న అభిమానాన్ని చూపెడుతూ ఉంటారు . కొందరు పుట్టినరోజు నాడు రక్తదానం చేయడం ..అన్నదానం చేయడం చేస్తూ ఉంటారు .

మరి కొందరు తమకు తోచినంత సహాయం పేదవాళ్లకు తమ హీరో పేరు చెప్పి అందిస్తూ ఉంటారు . రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఆయనపై ఉండే అభిమానంతో ఏకంగా తన సొంత కల ఇంటిని నెరవేర్చుకునే క్రమంలో ఎన్ టీఆర్ ఇటుకలను ప్రత్యేకంగా ముద్రించుకున్నాడు . దీంతో ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఎన్టీఆర్ అంటే పడి చచ్చిపోయే ఓ అభిమాని కొత్త ఇంటిని నిర్మించుకోవాలని ఫిక్స్ అయ్యారు.

అయితే దానిపై తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ పేరు కచ్చితంగా ఉండాలి అని బట్టి కార్మికులకు చెప్పి ఎన్టీఆర్ పేరుతో అచ్చు వేయించుకొని ఇటుకలను రూపొందించుకున్నాడు . అంతేకాదు ఆయన ఇంటికి వాడే ప్రతి ఇటుకపై తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ పేరు ఉండాలి అంటూ ఫస్ట్ నుంచి అనుకున్న ఆయన అదే కలను నెరవేర్చుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news