Moviesఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టినా.. గ్లోబల్ స్ధాయిలో గుర్తింపు వచ్చినా..ప్రశాంత్...

ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టినా.. గ్లోబల్ స్ధాయిలో గుర్తింపు వచ్చినా..ప్రశాంత్ నీల్ సినిమా NTR కి సో స్పెషల్..ఎందుకంటే..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు .. పాన్ ఇండియా హీరోలు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న హీరోలు కూడా ఉన్నారు. అయితే వాళ్లందరిలోకి చాలా చాలా ప్రత్యేకంగా కనిపిస్తాడు ఎన్టీఆర్ . నందమూరి నటవారుసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తారక్ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు . హిట్లు ప్లాపులు అంటూ సంబంధం లేకుండా కెరియర్ స్టార్టింగ్ లో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రను చూస్ చేసుకున్న ఇప్పుడు ఎక్కువగా మెసేజ్ ఓరియంటెడ్ ..జనాలను ఎంటర్టైనింగ్ చేసే విధంగా ఉన్న కథలను చూస్ చేసుకుంటున్నాడు.

ప్రెసెంట్ ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తున్నాడు . గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న తారక్ ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నాడట . ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది. ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దశకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు ఎన్టీఆర్ . అయితే ఈ సినిమా ఎన్టీఆర్ కి చాలా చాలా స్పెషల్ ఎందుకంటే ..

ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో తన కొడుకు అభయ్ రామ్ కనిపించబోతున్నాడు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. దీనికి ఎన్టీఆర్ సైతం ఓకే చెప్పారట . తన కొడుకుని సినీ ఇండస్ట్రీలోకి తన సినిమా ద్వారానే ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండడం .. అది కూడా తన ఫేవరెట్ డైరెక్టర్ కం ఫ్రెండ్ ప్రశాంత్ దర్శకత్వంలో కావడం ఆయనకు ఎంతో ఎంతో స్పెషల్ గా మారిపోయింది . ఇదే న్యూస్ ఇప్పుడు నందమూరి అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news