Newsఇప్పుడు బిగ్ బాస్ కి కొత్త హోస్ట్‌ వచ్చే సమయం ఆసన్నం...

ఇప్పుడు బిగ్ బాస్ కి కొత్త హోస్ట్‌ వచ్చే సమయం ఆసన్నం అయిపోయిన‌ట్టుగా ఉంది. సీజ‌న్ 7కే నాగార్జున

ఉండ‌క‌పోవ‌చ్చంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయినా ఆ స్థాయి ఛ‌రిష్మా ఉన్న వాళ్లు ఎవ్వ‌రూ దొర‌క‌క‌పోవ‌డంతో నాగార్జున‌నే కంటిన్యూ చేశారు. అయితే బాల‌య్య‌తో ఆహా వారు ఓటీటీ బిగ్‌బాస్‌కు ప్లాన్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. అల్లు అర‌వింద్ ఇప్పుడు బాల‌య్య‌ను త‌మ ఓటీటీ బిగ్‌బాస్ షోకు హోస్ట్ చేయాల‌ని ఒప్పించిన‌ట్టుగా తెలుస్తోంది.

బాల‌య్య ఇప్ప‌టికే అదే ఆహాలో అన్‌స్టాప‌బుల్ షోతో త‌న విశ్వ‌రూపం ఎలా ఉంటుందో చూపించేశారు. ఇప్పుడు బిగ్‌బాస్‌ను కూడా హోస్ట్ చేస్తే బుల్లితెర‌పై బాల‌య్య హోస్టింగ్ మ‌రింత‌గా స‌రికొత్త పుంత‌లు తొక్క‌డం ఖాయం అనుకోవాలి. అయితే బాల‌య్య సినిమాలు, రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌డంతో బిగ్‌బాస్ ఓటీటీకి ఎంత వ‌ర‌కు టైం కేటాయిస్తార‌నేది చూడాలి. బాల‌య్య బిగ్‌బాస్ ఓటీటీ హోస్ట్ చేస్తే మ‌ళ్లీ రికార్డుల మోత మోగిపోవ‌డం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news