Newsబిగ్ ట్విస్ట్‌: ' గుంటూరు కారం ' రిలీజ్ డేట్ మారింది.....

బిగ్ ట్విస్ట్‌: ‘ గుంటూరు కారం ‘ రిలీజ్ డేట్ మారింది.. కొత్త డేట్ ఇదే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో 13 ఏళ్ల తర్వాత వస్తున్న‌ ఈ సినిమాపై టాలీవుడ్ లో క‌నీవినీ ఎరగని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న థియేటర్లోకి వస్తుందని ఇప్పటికే ప్రకటించారు.

గుంటూరు కారం నుంచి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు.. మహేష్ బాబు స్టిల్స్ కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే లేట్ అవుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని నిర్మాతలు ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. గుంటూరు కారం సినిమాను జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా ఒకరోజు ముందుగానే థియేటర్లలోకి రానుంది. సంక్రాంతికి గట్టి పోటీ ఉండడంతో సినిమాకి ఓపెనింగ్ కీలకం కావడంతో ఒకరోజు ముందుకు జరిపి జనవరి 11న గుంటూరు కారం సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

హారిక & హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. మహేష్ బాబుకి జోడిగా శ్రీలీల – మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు తెలుగు వెర్షన్ లోనే ప్రపంచంగా రు. 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news