Newsవరుణ్-లావణ్య ల పెళ్లిలో మెగా ఫ్యామిలీ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్.. భయం...

వరుణ్-లావణ్య ల పెళ్లిలో మెగా ఫ్యామిలీ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్.. భయం భయంగా మెగాస్టార్ చిరంజీవి..!?

రీసెంట్ గానే హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నారు . దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అయితే ఇలాంటి క్రమంలోనే వరుణ్ లావణ్య పెళ్లికి సంబంధించి కొన్ని క్రేజీ క్రేజీ రూమర్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి . వరుణ్ లావణ్య పెళ్ళి వీడియో నెట్ ఫ్లిక్స్ కి దాదాపు 8 కోట్లకు అమ్మేశారు అంటూ ప్రచారం జరిగింది. రీసెంట్ గానే వరుణ్ తేజ్ దానిపై క్లారిటీ ఇచ్చాడు .

అలాంటిది ఏదీ లేదు అని.. త్వరలోనే మా పెళ్లి వీడియో మీరు చూస్తారు అంటూ ఫైనల్ గా అభిమానులకు గుడ్ న్యూస్ అందజేశారు. అయితే వరుణ్ పెళ్లి విషయంలో మెగాస్టార్ చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు అంటూ మరో న్యూస్ వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే మొదటి నుంచి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే ఆ బంధం ఎక్కువ కాలం నిలవదు. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా విడాకులు తీసుకుంటారు . ఇదే విషయాన్ని చిరంజీవి.. వరుణ్ – లావణ్యలతో లవ్ మేటర్ గురించి చెప్పినప్పుడు చెప్పారట .

అయితే వరుణ్ మాత్రం ససేమీరా ఒప్పుకోలేదట . నేను లావణ్యని పెళ్లి చేసుకుంటాను అంటూ భీష్ముంచుకుని కూర్చున్నాడట. ఇక వాడి ఇష్టం వాడిది అంటూ చిరంజీవి సైతం వదిలేసాడట . పెళ్లికూడా బాగా జరిగింది. అయితే చిరంజీవిని మాత్రం ఎక్కడో ఇంకా ఆ విడాకులు మేటర్ భయపడుతూనే ఉందట. ఆల్రెడీ శ్రీజ – నిహారిక విడాకులు తీసుకొని మెగా పరువును రోడ్డు మీదకి వేసేసారు . ఒకవేళ లావణ్య వరుణ్ కూడా ఆ హీరో హీరోయిన్ల సెంటిమెంట్ విడాకులు రిపీట్ అయితే మెగా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? మీడియాలో మెగా ఫ్యామిలీ పై ఎలా మాట్లాడుతారు..? అంటూ ఏదో ఒక మూల భయం భయంగానే ఉన్నాడట . అందుకే పెళ్లి జరిగినా కూడా ఎంజాయ్ చేయలేకపోయాడు మెగాస్టార్ అన్న వార్త వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news