Newsత్రిషకి మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణలు చెప్పడం వెనుక .....

త్రిషకి మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణలు చెప్పడం వెనుక .. ఆ స్టార్ హీరో ఉన్నాడా..?

ఫైనల్లీ ఎట్టకేలకు ఇన్ని రోజులుగా జరుగుతున్న వివాదానికి తెరదించాడు మన్సూర్ అలీఖాన్ . కోలీవుడ్ స్టార్ నటుడిగా పాపులారిటి సంపాదించుకున్న ఆయన పలు సినిమాల్లో కీలక పాత్రలు నటించి మెప్పించిన విషయం అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా రీసెంట్గా నటించిన లియో సినిమాలో మంచి పాత్ర పోషించి అభిమానులను ఆకట్టుకున్నాడు . అయితే నోటి దూల కారణంగా హీరోయిన్ త్రిషపై చేసిన కొన్ని వ్యాఖ్యలు అభిమానులను తీవ్రంగా హర్ట్ చేశాయి.

సినిమా ఇండస్ట్రీ మొత్తం కదిలి త్రిష వైపు వెళ్లడంతో మన్సూర్ అలీ ఖాన్ దిగిరాక తప్పలేదు. నేను తప్పు చేయలేదు నేను సారీ చెప్పను అంటూ వీర వీగిన ఆయనే త్రిషకు బహిరంగ క్షమాపనులు చెప్పారు . అంతేకాదు దక్షిణ భారత నటీనటుల సంఘం ఆయనను హెచ్చరిస్తూ నోటీసులు కూడా పంపింది . త్రిషకు సరైన సమాధానం చెప్పాలని క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ తీవ్రంగా హెచ్చరించింది.

ఫైనల్లీ మన్సూర్ అలీ ఖాన్ దిగివచ్చాడు . త్రిష కు బహిరంగ క్షమాపనులు చెప్పారు . “కత్తి లేకుండా వారం రోజులపాటు యుద్ధం చేశానని .. ఈ యుద్ధంలో ఎటువంటి రక్తపాతం లేకుండానే గెలిచానని నా వ్యాఖ్యలు త్రిషకు బాధ కలిగిచుంటే సారీ “అంటూ మన్సూర్ అలీ ఖాన్ మీడియా ప్రకటన ద్వారా సారీ చెప్పారు. ” తప్పు చేయడం మానవత్వం క్షమించడం దైవం ” అంటూ త్రిష పెట్టిన ట్వీట్ తో ఈ వివాదానికి తెరపడినట్లుగా అంతా భావిస్తున్నారు . అయితే మన్సూర్ అలీ ఖాన్ ఇలా సడన్గా త్రిషకు సారీ చెప్పడం వెనక కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో హస్తం ఉందని ఆయనే ఈ వివాదాన్ని సర్దుమనిగేలా ఇలా కూల్ గా సారీ తో మేటర్ ని సాల్వ్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news