Moviesఎన్టీఆర్ సినిమా బ‌డ్జెట్ రు. 1200 కోట్లా… పెద్ద షాకింగ్ ఇది…!

ఎన్టీఆర్ సినిమా బ‌డ్జెట్ రు. 1200 కోట్లా… పెద్ద షాకింగ్ ఇది…!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ పెరిగిపోయిన నేపథ్యంలో స్టార్ హీరోల సినిమాల బడ్జెట్ కూడా భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఏ హీరో సినిమా చూసినా సరే వందల కోట్ల బడ్జెట్ అనే చెబుతున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు వందల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు నిర్మాతలు.

ఇదిలా ఉండగా మొన్నటివరకు ఎన్టీఆర్ సినిమాల బడ్జెట్ ఒక రేంజ్ వరకు ఉండేది. అయితే ఇప్పుడు ఆయన సినిమాలకు కూడా బడ్జెట్ భారీగా పెంచేస్తున్నారు. దీనికి కారణం ఆర్ ఆర్ ఆర్ సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన ఈయనకు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ లభించింది. అందుకే ఇప్పుడు ఆయన తదుపరి చిత్రాలన్నీ కూడా భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్నాయి. మరొకవైపు నిర్మాతలు కూడా ఈయన సినిమాలకు భారీ బడ్జెట్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్లో దేవర అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఫిక్షన్ సబ్జెక్టుతో పీరియాడిక్ మూవీ గా వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తామని ఇప్పటికే డైరెక్టర్ కొరటాల శివ వెల్లడించారు. ఇక రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మరొకవైపు ఎన్టీఆర్ నటించబోతున్న సినిమా వార్ 2 ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నారు.

ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ మొదలవగా త్వరలోనే ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు ఎన్టీఆర్.. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఆయన చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా కోసం ఏకంగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ ను కేటాయించినట్లు సమాచారం. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news