News"తప్పు అని తెలుసు..కానీ తప్పక చేశా".. వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన...

“తప్పు అని తెలుసు..కానీ తప్పక చేశా”.. వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన కామెంట్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎలాంటి బోల్డ్ పాత్రల్లో కనిపిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా కొంతమంది హీరోయిన్స్ సినిమాలో నటించడం కోసం తమ బాడీను టోటల్గా మార్చేసుకుంటున్నారు . ఆలిస్ట్ లోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ వరలక్ష్మి శరత్ కుమార్ . తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా నటించిన సినిమా కోటబొమ్మాలి.

ఈ సినిమా 24న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యేలా కామెంట్స్ చేసింది . “నాయట్టుకి రీమేక్గా కోటబొమ్మాలి సినిమా వస్తుంది. అయితే దీనికి చాలా మార్పులు చేశారు మేకర్స్ . మరీ ముఖ్యంగా నా క్యారెక్టర్ ను బాగా బాగా పెంచేశారు. అంతేకాదు ఏ సినిమాలో చేయని పనిని ఈ సినిమాలో చేయించారు . నా చేత స్మోకింగ్ చేయించారు”.

“అది నాకు చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది . నిజానికి నాకు స్మోకింగ్ అంటే పడదు . కానీ క్యారెక్టర్ కి ఈ సీన్ కంపల్సరీ కావడంతో నేను స్మోకింగ్ చేయక తప్పలేదు . ఈ సినిమా యాక్షన్ కంటే మైండ్ గేమ్ ఎక్కువగా ఉంటుంది అని.. ఖచ్చితంగా జనాలను ఎంటర్టైన్ చేస్తుంది ” అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ చెప్పుకొచ్చింది. దీంతో సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news