News"హ్యాపీడేస్ సినిమాలో చేయాలంటే డబ్బులు లంచంగా అడిగారు".. షాకింగ్ మ్యాటర్ ని...

“హ్యాపీడేస్ సినిమాలో చేయాలంటే డబ్బులు లంచంగా అడిగారు”.. షాకింగ్ మ్యాటర్ ని రివీల్ చేసిన వీజే సన్నీ..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే పలువురు హీరోలు కొన్ని విషయాలను ఓపెన్ గానే బయట పెడుతూ సంచలనానికి తెరలేపుతున్నారు . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎలా ఉందో అలాగే లంచగొండితనం కూడా ఉంది అంటూ పలువురు హీరోలు చెప్పుకొస్తున్నారు. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా మారుతున్న బిగ్ బాస్ విన్నర్ సన్నీ రీసెంట్ గా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆయన మూడోసారి హీరోగా నటిస్తున్న సినిమా సౌండ్ పార్టీ . ఇందులో హృతిక శ్రీనివాస్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. అమృతం ఫెమ్ శివ నారాయణ ముఖ్యపాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ అభిమానులను బాగా కట్టుకునింది. నవంబర్ 24 ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్న సన్నీ తన గురించి మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు .

“నా కెరియర్ స్టార్టింగ్ లోనే సినీ పరిశ్రమలో చాలా కష్టాలు చూశాను . నటుడుగా ఎదగడానికి చాలా ప్రయత్నించాను . కొన్ని సినిమాల్లో ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది . హ్యాపీ డేస్ సినిమాలో నన్ను సెలెక్ట్ చేశారు . నలుగురు హీరోలలో ఒక పాత్రకు నన్ను ఫిక్స్ చేయాలని ఫిక్స్ అయిపోయారు . అయితే లక్షల్లో డబ్బు అడిగారు . నాకు అంత స్తోమత లేదు . డబ్బులు లంచంగా ఇవ్వలేక నేను ఆ పాత్ర నుంచి తప్పుకున్నాను “అంటూ సంచలన కామెంట్స్ చేశాడు.

దీంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అయితే గతంలో హీరో నిఖిల్ కూడా ఇదేవిధంగా కామెంట్ చేశారు. హ్యాపీ డేస్ కి సెలెక్ట్ అయ్యాక నలుగురు హీరోలలో ఒక పాత్ర ఉండాలి అంటే.. లక్ష రూపాయలు అడిగారు అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇదే న్యూస్ వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news